#RRR లేటెస్ట్ అప్డేట్

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం #RRR లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటించనుంది. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. [more]

Update: 2019-07-07 15:46 GMT

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం #RRR లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటించనుంది. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం జక్కన్న అమెరికా పర్యటనలో ఉన్నారు తిరిగి రాగానే ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రాజమౌళి తిరిగి రాగానే వెంటనే చరణ్ అలియా కాంబినేషన్ లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.

ఈ షెడ్యూల్ ని రాజమౌళి పూణే, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక రీసెంట్ గా రాజమౌళి..రామ్ చరణ్,ఎన్టీఆర్ ల పై హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఫైట్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసారు. ఇందులో రామ్ చరణ్ సీతారామ రాజు పాత్రలో కనిపిస్తుండగా, అలియా ఆయన జోడిగా సీత పాత్రలో కనిపిస్తుందట.

అలానే ఇందులో మరోముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కనిపించనున్నారు. దాదాపు 350 కోట్లు తో ఈసినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30 న ఈసినిమాను రిలీజ్ చేస్తునట్టు అధికారంగా ప్రకటించారు మేకర్స్.

Tags:    

Similar News