రాజమౌళి – ప్రభాస్ కలిసి.. ?

బాహుబలి తో ప్రభాస్ ఇంటెర్నేషనల్ స్టార్ కాగా.. రాజమౌళి అయితే భీబత్సమైన క్రేజున్న డైరెక్టర్ గా మారిపోయారు. ప్రభాస్ మరియు రాజమౌలి ఇద్దరూ పాన్-ఇండియా సూపర్ స్టార్స్ [more]

Update: 2020-02-06 07:22 GMT

బాహుబలి తో ప్రభాస్ ఇంటెర్నేషనల్ స్టార్ కాగా.. రాజమౌళి అయితే భీబత్సమైన క్రేజున్న డైరెక్టర్ గా మారిపోయారు. ప్రభాస్ మరియు రాజమౌలి ఇద్దరూ పాన్-ఇండియా సూపర్ స్టార్స్ అయ్యారు. ప్రభాస్, రాజమౌళి ప్రస్తుతం విడివిడిగా సినిమాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి కాస్త గ్యాప్ తో #RRR చేస్తుంటే.. ప్రభాస్ సాహో చేసి ప్లాప్ కొట్టాడు. తాజాగా పాన్ ఇండియా ఫిలిం జాన్ లో నటిస్తున్నాడు. అయితే మల్లి వీళ్లిద్దరు కలిసి పని చేస్తే ఆ క్రేజే వేరు. అభిమానులు కూడా ఇద్దరూ త్వరలో తిరిగి కలుస్తారా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ప్రభాస్ రాజమౌళి కలపబోతున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

కానీ ఈసారి రాజమౌళి సినిమాకి దర్శకత్వం వహించడు, ప్రభాస్ హీరోగా నటించడం కాదు.. ప్రభాస్ మరియు రాజమౌళి కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించనున్నారట. యువ చిత్రనిర్మాతలకు కంటెంట్-బేస్డ్ ఫ్లిక్స్ తో రావడానికి అవకాశం కల్పించే ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడం గురించి ప్రభాస్ మరియు రాజమౌళి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇది ఎంత త్వరగా వర్కౌట్ అయితే అంత త్వరగా ప్రారంభించాలని చూస్తున్నారట. ప్రభాస్ ఇప్పటికే తన ఫ్రెండ్స్ తో కలిసి యువి క్రియేషన్స్ అంటూ నిర్మాణ సంస్థతో పని చేస్తున్నాడు. మరోపక్క రాజమౌళి సాయి కొర్రపాటి తో కలిసి కొన్ని సినిమాలకు అన్ అఫీషియల్ నిర్మాతగా ఉన్నాడు. తాజాగా రాజమౌళి – ప్రభాస్ ఒకటై నిర్మాణ సంస్థ పెడితే ఆ క్రేజ్ మాటల్లో చెప్పడానికి వీలుండదు

Tags:    

Similar News