RRR బాలీవుడ్ వెర్షన్ పై స్పెషల్ కేర్

రాజమౌళి బాహుబలి విషయంలో టైం తీసుకుంటే తీసుకున్నాడు కానీ… ఆ సినిమా అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ తీర్చిదిద్దాడు. బాహుబలి ని [more]

Update: 2019-12-03 06:21 GMT

రాజమౌళి బాహుబలి విషయంలో టైం తీసుకుంటే తీసుకున్నాడు కానీ… ఆ సినిమా అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ తీర్చిదిద్దాడు. బాహుబలి ని అన్ని భాషల ప్రేక్షకులు ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ని ప్రపంచపటంలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు తెరకెక్కిస్తునం #RRR విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పది భాషల్లో సినిమాని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చేలా #RRR ని స్పెషల్ కేర్ తీసుంటున్నాడట రాజమౌళి. రామ్ చరణ్ జంజీర్ తో బాలీవుడ్ లో అట్టర్ ప్లాప్ అందుకోవడం, ఎన్టీఆర్ కి అసలు బాలీవుడ్ పరిచయం లేకపోవడంతో.. అక్కడి ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఉన్నప్పటికీ.. రాజమౌళి కథ, తన పాత్రల మీదున్న నమ్మకంతో బాలీవుడ్ లో #RRR విషయంలో కాస్త కూల్ గా వున్నట్లుగా తెలుస్తుంది.

అందులో సాహో, సై రా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాలీవుడ్ లో ఘోరంగా దెబ్బతినడంతో… బాలీవుడ్ ప్రేక్షకులకు #RRR మీద డౌట్ ఉంటుంది. సాహో కానీ సై రా కానీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బాహుబలి ఎంత పెద్ద హిట్ అయినా… సాహో, సై రా ఎఫెక్ట్ #RRR మీద పడకుండా చూడాలని రాజమౌళి తన టీం తో చెప్పడమే కాదు, దానికి కావాల్సిన ప్రమోషన్స్ కూడా పక్కాగా ఉండాలని అనుకుంటున్నాడట. జనవరి నుండి #RRR విడుదలయ్యే జులై 30 వరకు #RRR ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చెయ్యాలని.. అప్పుడే సినిమా మీద ఆటోమేటిక్ గా క్రేజ్ వస్తుందని రాజమౌళి భావిస్తున్నాడట. ఏదైనా బాలీవుడ్ మీద మాత్రం రాజమౌళి స్పెషల్ క్రే తీసుకుంటున్నాడని టాక్

Tags:    

Similar News