ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి పక్కా ప్లాన్?

రాజమౌళి RRR అప్ డేట్ ఇచ్చేవరకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ అల్లడైపోయారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి వదిలిన అల్లూరి సీతారామరాజు [more]

Update: 2020-04-04 07:19 GMT

రాజమౌళి RRR అప్ డేట్ ఇచ్చేవరకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ అల్లడైపోయారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి వదిలిన అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ స్పెషల్ వీడియో తో రామ్ చరణ్ ఫాన్స్ తో పాటుగా ఎన్టీఆర్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ఆ వీడియో కేవలం ఫాన్స్ ని మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసింది. రామ్ చరణ్ కండలు తిరిగిన బాడీ తో చేసిన యాక్షన్ కి రామ్ చరణ్ ఫాన్స్ పిచ్చ హ్యాపీ. ఆ వీడియో కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కూల్ అయ్యారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీకి ఇప్పుడొక గాసిప్ అడ్డుకట్ట వేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు స్పెషల్ వీడియో లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండదని.. ఎన్టీఆర్ సినిమాలోని కొన్ని సీన్స్ లో స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని.. అంతేకాకుండా ఆ స్పెషల్ వీడియో లో పులి ఎన్టీఆర్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా రివీల్ చేయబోతున్నారని.. ఎన్టీఆర్ పుట్టిన రోజు విడియోలో ఇవే హైలైట్స్ గా నిలివబోతున్నాయని చెబుతున్నారు. ఆ గాసిప్ లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ రెండు నెలలు దాన్నే ఊహించుకుంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పిచ్చ ఖుషీగా ఉంటారంటున్నారు.

Tags:    

Similar News