జక్కన్న భలే ప్లాన్ వేసాడు..!

దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని [more]

Update: 2018-12-28 08:16 GMT

దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని చాలా డిటైల్ గా తీసే రాజమౌళి షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈయన సినిమాలు అనుకున్న టైంలో రిలీజ్ అవ్వవు. ప్రస్తుతం #RRR షూటింగ్ చేస్తున్న జక్కన్న రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసాడు. మరో షెడ్యూల్ ను వచ్చే నెల నుండి స్టార్ట్ చేయనున్నాడు. మరి ఎప్పటివరకూ రామ్ చరణ్, తారక్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు డేట్స్ ఇచ్చారట. అప్పుటివరకు కావాలని రాజమౌళి అడిగిగారట.

సంక్రాంతికి క్లారిటీ వస్తుందా..?

దసరా లోపు షూటింగ్ కంప్లీట్ చేసి అప్పటినుండి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసాడట జక్కన్న. అంటే అక్టోబర్ తరువాత నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ పై పని చేయడం మొదలు పెట్టొచ్చు. జక్కన్న అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇద్దరి ఫస్ట్ లుక్స్ దసరాకు లాంచ్ అవుతాయి. డిలే అయిన పక్షంలో ఇద్దరి కొత్త సినిమాల షూటింగ్ కూడా ఆలస్యం అవుతాయి. ఇప్పటివరకు రాజమౌళి ఇతర నటీనటుల పేర్లు వెల్లడించలేదు. రాజమౌళి ఏది త్వరగా చెప్పాడు కదా. కాబట్టి సంక్రాంతి టైంకి ఇతర నటుల వివరాలను, హీరోయిన్ల పేర్లు అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ తీసుకుని రావాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News