ఆయన ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్న శంకర్

Update: 2018-12-02 04:14 GMT

2.0 రిలీజ్‌ టైములో రాజమౌళి - శంకర్ ఒకరిఒక్కరు నేను మీ ఫ్యాన్..నేను మీ ఫ్యాన్ అని తెగ హడావిడి చేశారు. సౌత్ ఇండియా లో టాప్ డైరెక్టర్స్ అనగానే మొదటి వీరి పేర్లు వస్తాయి. అలాంటిది వీరి సినిమాలు వస్తున్నాయి అంటే తమ ఫ్యాన్సే కాదు సెలెబ్రెటీస్ కూడా వెయిట్ చేసి మరి ఎంత బిజీగా ఉన్నా సినిమాను చూస్తారు. ఈసినిమా విడుదలకి ముందు రోజు చాలా ఎక్సయిటెడ్‌గా వున్నానని చెప్పిన రాజమౌళి సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా ఇంకా తన ఒపీనియన్ ని చెప్పలేదు.

ఎంత బిజీగా ఉన్న పెద్ద సినిమాలు చూసి మరి ఆదరించే రాజమౌళి ఇంకా ఈసినిమా చూడకపోవటం ఏంటని ఆశర్యపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈసినిమా చూడలేకపోయాడని తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఎక్కడ తేడా రాకుండా...కాల్షీట్‌ని కేర్‌ఫుల్‌గా వాడుకుంటున్నాడు. ఈరోజు ఆదివారం కాబట్టి షూటింగ్ కి సెలవు ఉంటది కాబట్టి ఈరోజు జక్కన్న 2.0 చూసే అవకాశముంది.

సినిమా చూస్తే కచ్చితంగా తన అభిప్రాయంని చెబుతాడు. 'బాహుబలి చూసి శంకర్ తన అభిప్రాన్ని చెప్పాడు అలానే రాజమౌళి కూడా ఈసినిమాను చూసి చెప్తాడని తమిళ సినీ ప్రియులు, శంకర్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2.0 కలెక్షన్స్ రోజురోజకి పెరిగిపోతున్నాయి. శంకర్ ఈ చిత్రం తరువాత భారతీయుడు 2 తీస్తున్న సంగతి తెలిసిందే

Similar News