RRR కి అదిరిపోయే అప్ డేట్

రాజమౌళి #RRR అప్ డేట్ ఎప్పుడు ఇస్తాడా? ఎలాంటి కొత్త విషయాలను రివీల్ చేస్తాడో? ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల లుక్స్ [more]

Update: 2019-12-10 06:34 GMT

రాజమౌళి #RRR అప్ డేట్ ఎప్పుడు ఇస్తాడా? ఎలాంటి కొత్త విషయాలను రివీల్ చేస్తాడో? ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల లుక్స్ ని ఎలా డిజైన్ చేసాడు? ఆ లుక్స్ ఎప్పుడు రివీల్ చేస్తాడో ? అని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రమే కాదు… యావత్ భారత దేశం ఎదురు చూస్తుంది. ఇప్పటికే అలియా భట్ – రామ్ చరణ్ ల మధ్యన సీన్స్ పూర్తికాగా.. తాజాగా ఎన్టీఆర్ అండ్ ఒలీవియా కాంబో సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ హీరోయిన్ కాంబో సీన్స్ కూడా త్వరలోనే పూర్తవుతాయని, అవి పూర్తి కాగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబో సన్నివేశాలని రాజమౌళి తెరకెక్కిస్తాడని చెబుతున్నారు. ఇప్పటికే 80 శాతం కంప్లీటైన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసే ఉండే సన్నివేశాలను మొదలెట్టబోతున్నారని అంటున్నారు.

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి పోరాడే యుద్ధ సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తాడని, సినిమాకి ఆ యుద్ధ సన్నివేశాలే హైలెట్ అని అంటున్నారు. ఇక సినిమాలో మొత్తంగా 8 పాటలు ఉండబోతున్నాయని, మూడు పాటలు సందర్భానుచితంగా వచ్చే పాటలు కాగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై చెరో రెండు డ్యూయెట్స్ ని ప్లాన్ చేశారట. అయితే #RRR షూటింగ్ మొత్తం సంక్రాంతికి ముందే ఫినిష్ చేసి.. తర్వాత సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గ్రాఫిక్ వర్క్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నాడట. మరి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే సినిమాని ఇంత ఫాస్ట్ గా రాజమౌళి ఫినిష్ చెయ్యడం మాత్రం షాకింగ్ విషయంగానే చెప్పాలి.

Tags:    

Similar News