దానయ్య తప్పుకుంటే 100 కోట్లు ఇస్తాడంట!

Update: 2018-10-21 07:19 GMT

వరస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి తన నెక్స్ట్ మూవీ డీవీవీ దానయ్య బ్యానర్లో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'బాహుబలి' సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడంతో రాజమౌళి సినిమా అంటే ఇండియా వైడ్ క్రేజ్ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాతకు భారీ ఆఫర్ వచ్చిందంట.

భారీ ఆఫర్ ఇచ్చినా......

డీవీవీ దానయ్య ఈచిత్రం నుండి తప్పుకుంటే భారీ మొత్తంలో నగదు ఇస్తామని ఓ నిర్మాత ఆఫర్ ఇచ్చాడని ఫిలిం నగర్ సమాచారం. రాజమౌళి సినిమా కోసం తాను ఎంతైనా ఖర్చు పెడతానని సదరు నిర్మాత, దానయ్య తప్పుకుంటే, రూ. 100 కోట్లను ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే క్రేజ్ అటువంటిది.

క్యూలో బయ్యర్లు......

ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వని ఈసినిమా కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుండి ఓవర్ సీస్ నుండి బయ్యర్లు క్యూలో ఉన్నారు. తనకు వచ్చిన ఆఫర్ గురించి దానయ్య నోరు విప్పనప్పటికీ అది నిజమేనని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Similar News