రాజమౌళి `ధూమ్‌` సినిమాను తీస్తున్నాడా..?

Update: 2018-10-27 07:54 GMT

#RRR మూవీకి ప్రస్తుతం హీరోలు మాత్రమే కంఫర్మ్ అయ్యారు.. ఇంకా సాంకేతిక నిపుణులు.. ఇతర నటీనటులు కంఫర్మ్ కావాల్సి వుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా చూపించాలని హాలీవుడ్ నుండి ఒక టెక్నీషియన్ పిలిచి తారక్ లుక్ ను డిజైన్ చేయిస్తున్నాడు జక్కన్న. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందనే చర్చ గత కొద్ది రోజుల నుండి జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఫిలింనగర్ లో ఈ సినిమా స్టోరీని సంబంధించి ఓ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ లో వ‌చ్చిన 'థూమ్' సిరీస్ ఎంత సూప‌ర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ గజ దొంగను పట్టుకునే పనిలో పోలీస్ ఉంటాడు. ఆ దొంగ డేట్‌, టైమ్‌, ప్లేస్ చెప్పి మరీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అదే 'ధూమ్‌' స్పెషాలిటీ. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా చూపిస్తుంటారు. అందుకే ఈ సిరీస్ అంతలా హిట్ అయింది.

అదే స్టోరీ లైన్ తో...

సరిగా ఇదే పాయింట్ చుట్టూ రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కూడా న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఇందులో ఎన్టీఆర్ దొంగ, చరణ్ పోలీస్ అని ప్రచారం జరుగుతుంది. కరెక్ట్ గా ఇదే పాయింట్ తో తెలుగులో నాగార్జున 'సూప‌ర్' వ‌చ్చింది. కానీ అది సక్సెస్ కాలేదు. అయితే ఈ మ‌ల్టీస్టార‌ర్ కి రాజమౌళి డైరెక్టర్ కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయలేము. 'థూమ్‌'ని మించే రాజమౌళి సినిమా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News