రాజమౌళీ… గురి చూసి కొట్టావయ్యా

రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కథ విషయంలో బోలెడన్ని కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇక రాజమౌళి ఈ చిత్రాన్ని [more]

Update: 2019-02-19 04:14 GMT

రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కథ విషయంలో బోలెడన్ని కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇక రాజమౌళి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో దానయ్య నిర్మాతగా నిర్మిస్తున్నాడు.అయితే ఈ సినిమా బాహుబలి వలే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందా.. లేదా అనే దాని మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. రాజమౌళి బాహుబలి తెరకెక్కించేటప్పుడే … ఆ సినిమాని ఇండియా వైడ్ గా విడుదల చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు. అలాగే నేషనల్ వైడ్ గా ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు.

అయితే రామ్ చరణ్ – ఎన్టీఆర్ లతో తియ్యబోయే #RRR సినిమాని ఇండియా వైడ్ గా విడుదల చేస్తాడా? లేదంటే కేవలం తెలుగులోకి పరిమితం చేస్తాడా? అనే డౌట్ ఉంది. కానీ #RRR కథ విషయంలో.. పడి ఈ విషయాన్నీ మీడియా అంతగా ప్రచారం చెయ్యలేదు. మరి ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని.. రెండ్ షెడ్యూల్ ని శరవేగంగా షూటింగ్ ని చిత్రీకరిస్తున్న ఈ #RRR కథని బాహుబలి రైటర్ విజియేంద్రప్రసాద్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే #RRR అనౌన్సమెంట్ తర్వాత ఈ చిత్రం విషయంలో నోరు మెదపని రాజమౌళి తాజాగా #RRR విషయమై మాట్లాడాడు.

ఈ #RRR చిత్రం బాహుబలికి మించి తెరకెక్కుతోందని… ఈ చిత్రం బాహుబలికి ఏమాత్రం తీసిపోదని.. ఇదొక పాన్ ఇండియా అంటే.. దేశంలోని అన్ని ప్రాంతాలకూ టచ్ అయ్యే చిత్రమని చెబుతున్నాడు.మరి ఇంతవరకు టాలీవుడ్ కే పరిమితమనుకుంటున్న #RRR చిత్రంపై ఇప్పుడు రాజమౌళి వ్యాఖ్యలతో భారీ నుండి అతి భారీ అంచనాలు పెరిగిపోయాయి. అందుకే హీరోయిన్స్ విషయంలో రాజమౌళి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ అయితే సినిమాకి స్పెషల్ క్రేజ్ ఆటోమాటిక్ గా వస్తుందని.. రామ్ చరణ్ కి అలియా భట్ ని.. ఎన్టీఆర్ కి మరో హీరోయిన్ ని సెట్ చేసే పనిలో జక్కన్న ఉన్నాడన్నమాట

Tags:    

Similar News