ఇక అందరూ సర్దుకోవాలే

ఎట్టకేలకు రాజమౌళి #RRR విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు. #RRR మొదలైనప్పుడు జులై 31 2020 రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసిన రాజమౌళి గత కొన్నాళ్లుగా [more]

Update: 2020-02-06 07:03 GMT

ఎట్టకేలకు రాజమౌళి #RRR విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు. #RRR మొదలైనప్పుడు జులై 31 2020 రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసిన రాజమౌళి గత కొన్నాళ్లుగా #RRR విడుదల డేట్ పై సస్పెన్స్ లో పెట్టి చంపుతున్నాడు. అసలు #RRR అప్ డేట్ ఇవ్వకుండా ఊరిస్తూ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్న రాజమౌళి #RRR విషయంలో ఏం జరుగుతుందో గుట్టుగా మైంటైన్ చేసాడు. అలాగే అభిమాన హీరోల లుక్స్ విడుదల చెయ్యకుండా జాగ్రత్త పడుతున్న రాజమౌళి కి మధ్య మధ్యలో లీకుల బెడద దడ పుట్టించింది. ఇక #RRR విడుదల డేట్ పై అందరిని సస్పెన్స్ లో ముంచెత్తిన రాజమౌళి ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెరదించాడు.

జనవరి 08 2021 సంక్రాంతికి #RRR విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసారు. సినిమా టెక్నీకల్, అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ వలన సినిమా జులై 31, 2020 నుండి జనవరి 8 కి పోస్ట్ పోన్ అయినట్లుగా చెబుతున్నారు. మరి 2021 జనవరిలో సంక్రాంతికి మొట్టమొదటగా డేట్ లాక్ చేసిన రాజమౌళి ని చూసి ఇప్పుడు మిగతా స్టార్ హీరోలంతా సర్దుకొవాల్సి వస్తుంది లేదంటే మళ్ళీ మహేష్, ప్రభాస్ , అల్లు అర్జున్ లాంటోళ్ళు 2021 సంకాంతికి తమ సినిమాలను తీసుకొచ్చే ఆలోచనలో ఉంటే… రాజమౌళి తాజా ప్రకటనతో సర్దుకుంటారు. లేదంటే #RRR ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందే. మరి నిజంగా రాజమౌళి ఎప్పుడూ చెప్పింది చెయ్యడు.. అన్నట్టుగా #RRR విడుదల విషయంలో మాట మర్చేసాడు. గతంలో బాహుబలి విషయంలోనూ రాజమౌళి ఇలానే రెండు మూడు డేట్స్ మార్చిన విషయం తెలిసిందే

Tags:    

Similar News