సరైన టైం లో... సరైన నిర్ణయం

Update: 2018-06-09 06:33 GMT

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా దూసుకుపోయిన రాజ్ తరుణ్ ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉసూరుమంటున్నాడు. అప్పట్లో హిట్ హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదించిన రాజ్ తరుణ్ ఇప్పుడు తన కెరీర్ లోనే అతి క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో చేసిన రంగుల రాట్నం సినిమా తో దెబ్బతిన్న రాజ్ తరుణ్ నిన్నగాక మొన్న రాజుగాడు తో మళ్ళీ కోలుకోలేని ఫ్లాపుని చవి చూసాడు. మరి ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాల హిట్స్ తో మనోడు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసాడు. హిట్స్ చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచి అడిగింది ఇస్తారు. అదే ఫ్లాప్స్ చేతిలో ఉంటె వాళ్ళిచ్చింది తీసుకోవాలి. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంప్రదాయం లేని ఆచారం.

రోటీన్ సినిమాలే దెబ్బకొట్టాయి....

మరి కుర్రోడు యాక్టివ్ గా ఉంటాడు.. అలాగే మినిమమ్ గ్యారెంటీ హీరో అని నిర్మాతలు కూడా ఒకప్పుడు రాజ్ తరుణ్ వెనక పడ్డారు. అలాగే రాజ్ తరుణ్ కూడా హీరోయిజం ఉన్న సినిమాలు చెయ్యకుండా.. కామెడీ, రొమాంటిక్ సినిమాలు చేస్తూ కెరీర్ ని నిలబెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా అదే కామెడీ, రొమాంటిక్ అంటుంటే... రాజ్ తరుణ్ సినిమాలు రొటీన్ అయ్యి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. రంగులరాట్నం, రాజుగాడు అలానే రొటీన్ ముద్ర వేసుకుని రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఖంగుతిన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అదేమిటంటే మొదటిగా కథల విషయంలో జాగ్రత్త వహించాలని... స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓకె అనుకున్నాకే సెట్స్ మీదకెళ్లాలని.. అంతేకాకుండా తన పారితోషకం విషయంలోనూ రాజా తరుణ్ ఒక సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నాడట.

సూపర్ నిర్ణయం తీసుకున్నాడు....

తన పారితోషకాన్ని సగానికి సగం తగ్గించడమే కాదు.... ఎవరైనా మంచి కథలతో తన వద్దకు వస్తే ఆ దర్శకనిర్మాతలకు తక్కువ కే సినిమా చేసిపెట్టాలని రాజ్ తరుణ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో ఉన్న సినిమాలకు కూడా రాజ్ తరుణ్ తక్కువ పారితోషకానికే సినిమాలు చేయబోతున్నాడట. మరి రాజ్ తరుణ్ ఆలోచన, నిర్ణయం మాత్రం సూపర్. ఒకవేళ రాజ్ తరుణ్ తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళంటే.. ఇక మనోడు కెరీర్ ఇరకాటంలో పడి వైజాగ్ ట్రైన్ ఎక్కాల్సిందే.

 

Similar News