నిత్యా – రాజ్ తరుణ్ కలిసి…!

రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఇక మలయాళ కుట్టి [more]

Update: 2019-05-09 07:59 GMT

రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఇక మలయాళ కుట్టి నిత్యా మీనన్ కాస్త బొద్దుగా తయారవడంతో తెలుగు తెరకు దూరమయ్యింది. ఈమధ్యన #RRR సినిమాలో ఎన్టీఆర్ కి సెకండ్ హీరోయిన్ గా నిత్య మీనన్ పేరు గట్టిగా వినబడినా రాజమౌళి నుండి స్పష్టత రాలేదు. గుండెజారి గల్లంతయిందేతో హిట్ కొట్టిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా రాజ్ తరుణ్ హీరోగా సినిమా త్వరలోనే మొదలవ్వబోతుంది.

పెద్ద వ‌య‌స్సు అమ్మాయిని ప్రేమించే పాత్ర‌లో

గుండెజారి గల్లంతయిందే హిట్ అయినా.. ఒక లైలా కోసం తేడా కొట్టడం, పర్సనల్ లైఫ్ లో కాస్త ఇబ్బందులతో సినిమా డైరెక్ష‌న్ ను పక్కనబెట్టిన విజయ్ కుమార్ చాలా గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈ సినిమా తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి కథ అని తెలుస్తోంది. ఇక ఇందులో రాజ్ తరుణ్ .. తనకన్నా వయసులో పెద్దదైన నిత్యాని ఆరాధించే పాత్ర చెయ్యబోతున్నాడన్నమాట. ఇక ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మించ‌బోతున్నారు.

Tags:    

Similar News