మహేష్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకున్నాడు

Update: 2018-12-07 06:18 GMT

హీరో రాజ్ తరుణ్ గుర్తు ఉన్నాడు కదా ఈ మధ్య పెద్దగా కనపడటం లేదు కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు. రాజ్ తరుణ్ కు వరస ఫ్లాప్స్ రావడంతో ట్విట్టర్ లో తరచూగా యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ... చాట్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. గతంలో రాజ్ తరుణ్ పెళ్లిపై రూమర్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ నేపధ్యంలో ఓ ఫ్యాన్ "మీరు పెళ్లి ఎప్పుడు చూసుకుంటారు" అని అడిగిన ప్రశ్నకు "వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పాడు". మరో అభిమాని.."ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అన్న ప్రశ్నకు "వచ్చే ఏడాది పెళ్లి చూసుకుంటున్న అని చెప్పాడు" కానీ లవ్ మ్యారేజా.. ఆరెంజా అని మాత్రం చెప్పలేదు.

ఫోటో దిగాను... కానీ షేర్ చేయను...

మరొక ఫ్యాన్ మహేష్ బాబుతో ఫోటో దిగి సోషల్ మీడియా లో షేర్ చేయొచ్చుగా అని అడిగిన ప్రశ్నకు..."నేను మహేష్ బాబుతో ఆల్రెడీ ఫోటో దిగాను.. కానీ అది షేర్ చేయను ఎందుకంటే అది నా పర్సనల్... నేను చనిపోయేటప్పుడు కూడా ఆ ఫోటో నాతో ఉంటుంది" అని సమాధానం ఇచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కు రాజ్ తరుణ్ పై రెస్పెక్ట్ పెరిగింది. ఆలా మహేష్ ఫ్యాన్స్ ను మనోడు బుట్టలో వేసుకున్నాడు.

Similar News