లక్కీ ఛాన్స్ కొట్టేసిన రాజ్ తరుణ్..!

ఒకప్పుడు వరుస విజయాలతో యంగ్ హీరోస్ కి పోటీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. కనీసం దిల్ రాజు లాంటి [more]

Update: 2019-03-11 06:24 GMT

ఒకప్పుడు వరుస విజయాలతో యంగ్ హీరోస్ కి పోటీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. కనీసం దిల్ రాజు లాంటి నిర్మాత అయినా హిట్ ఇస్తాడని ఆశపడిన రాజ్ తరుణ్ కి దిల్ రాజు కూడా హిట్ ఇవ్వలేకపోయాడు. దెబ్బకి రాజ్ తరుణ్ చాన్నాళ్లుగా ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతే కాకుండా రాజ్ తరుణ్ మార్కెట్ కూడా బాగా పడిపోయింది. ప్రస్తుతం వార్తల్లో లేని రాజ్ తరుణ్ ఈ మధ్యలో దిల్ రాజుతో సినిమా చేయబోతున్నాడని ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ విషయమై ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. మంచి కథ దొరికితే సినిమా చేద్దామని కాచుకు కూర్చున్న రాజ్ తరుణ్ కి ఇప్పుడొక భారీ ప్రాజెక్ట్ తగిలింది.

అక్షయ్ కుమార్ తో కలిసి

అది కూడా దగ్గుబాటి రానా నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా రంగంలోకి దిగబోతున్నాడు. గత కొంతకాలంగా రానా అటు హీరోగా, ఇటు నిర్మాణ రంగంలోనూ బిజీగా మారుతున్నాడు. తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ మీద భారీ, మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక రానా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలతో నిర్మాణ రంగంలోకి దిగాడు. తాజాగా రానా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి తెలుగు, హిందీ భాషల్లో ఒక సినిమా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. అయితే బాలీవుడ్, టాలీవుడ్ లో తెరకెక్కబోయే ఆ సినిమా కోసం హిందీ భాషకి ఇంకా హీరో ని సెట్ చెయ్యని రానా అండ్ టీం… తెలుగులో నిర్మితమవుతున్న సినిమా కోసం రాజ్ తరుణ్ ని సంప్రదించారని.. రాజ్ తరుణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News