ఆ హీరోగారి తండ్రికి మూడేళ్లు జైలా?

Update: 2018-04-21 07:32 GMT

ఉయ్యాలా జంపాల, కుమారి 21 ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇలా మంచి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన కుర్ర హీరోకి ఈ మధ్యన టైం అస్సలు కలిసి రావడం లేదు. ఈ ఏడాది మొదట్లోనే రంగుల రాట్నం తో వచ్చిన రాజ్ తరుణ్ ని తిప్పికొట్టారు ప్రేక్షకులు. ఇక మరో సినిమా రాజుగారు సినిమా మీద అస్సలు అంచనాలే లేవు. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరింత విపత్కర పరిస్థితుల్లో పడ్డాడు. ఆ విపత్కర పరిస్థితులు ఎందుకొచ్చాయి అంటే.. ఆయన గారి తండ్రి వలన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడు.

రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్లు జైలు శిక్ష మరియు 20 వేల జరిమానా విధిస్తూ.... విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పిచ్చారు. ఇంతకీ బసవరాజుకు ఇలా మూడేళ్లు జైలు శిక్ష పడడానికి కారణమేమిటంటే... ఆయనగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్ పనిచేసిన టైం లో నకిలీ బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి... డబ్బు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. బసవరాజు భార్య రాజ్యలక్ష్మి మరియి పక్కింటి మహిళల పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించిన ఆయన బ్యాంక్ నుండి దాడ్పుగా 9.85 లక్షల రుణం పొందారు.

ఇక తర్వాత బ్యాంక్ తనిఖీల్లో ఈ విషయం బయటికి తెలియడంతో.... అప్పటి బ్యాంక్ మేనేజర్ బసవరాజు పై కేసు పెట్టగా.... అది ఇప్పుడు హియరింగ్ కి రావడము బసవరాజు కి శిక్ష పడడము జరిగింది. మరి తండ్రి కి జైలు శిక్ష పడడంతో రాజ్ తరుణ్ బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కెరీర్ లోను, లైఫ్ లోని రాజ్ తరుణ్ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాడని అంటున్నారు.

Similar News