బాబోయ్ ఈ వారం కూడా అదే ప్రాబ్లెమ్!

Update: 2018-07-18 03:33 GMT

మే నెలలో మహానటి సూపర్ హిట్, జూన్ లో అభిమన్యుడు హిట్ అయితే.. సమ్మోహనం పర్వాలేదనిపించింది. అంతకు మించి ఎన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసిన ఒక్క సినిమా కూడా నిలబడలేక చేతులెత్తేశాయి. ఇక ఈ నెలలో మొదటి వారంలో విడుదలైన గోపీచంద్ పంతం యావరేజ్ కాగా.. సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు ప్లాప్. అలాగే గత గురువారం కళ్యాణ్ దేవ్ విజేత ప్లాప్ కాగా...కార్తికేయ RX 100 అనుకోకుండా హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక శుక్రవారం విడుదలైన చినబాబు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లేవు. మరి ఈ వారమైన మంచి సినిమాలేమన్న బాక్సాఫీసు బరిలో ఉన్నాయా... అంటే నో అనేమాట వినబడుతుంది.

అదేమిటి రాజ్ తరుణ్ లవర్ ఉందిగా అనొచ్చు. కానీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్ లవర్ సినిమాకి ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. దిల్ రాజు లాంటి నిర్మాత ఈ సినిమాని నిర్మించినప్పటికీ... రాజ్ తరుణ్ వరస ప్లాప్స్ వలన ఈ లవర్ సినిమాకి అసలు ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ లేదు. ఏదో వచ్చిందా వెళ్లిందా అనే టైప్ లో ఉంది లవర్ పరిస్థితి. ఇక మరో సినిమా లక్ష్మి మంచు నటించిన వైఫ్ ఆఫ్ రామ్ సినిమా లో కూడా విషయం ఏమాత్రం ఉందొ తెలియదు గాని... ఆ సినిమాపై కూడా ఎలాంటి బజ్ లేదు. ప్రమోషన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ... అవేమి వర్కౌట్ అవుతాయంటే నమ్మకం లేదు.

ఈ వారం ఇంకో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆ నలుగురు దర్శకుడు చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ఆట గదరా శివ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఈ సినిమా సాంగ్ ని విడుదల చేసిన ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ కాలేదు. ఇక నాలుగో సినిమా పరిచయం. సినిమాని బాగా పబ్లిసిటీ చేస్తున్నప్పటికీ... అందరు కొత్తవాళ్ళు కావడం.. హీరోని చూస్తుంటే అసలు డైజెస్ట్ చేసుకోలేని పరిస్తితుల్లో ప్రేక్షకులు ఉన్నారంటే ఆ సినిమా పరిస్థితి ఎలా ఉందొ తెలుస్తుంది. మరి ఈ వారం కూడా బాక్సాఫీసు వద్ద ఈగలు తోలుకునే పరిస్తితుల్లో థియేటర్స్ యాజమాన్యం ఉంది. ఇక ఈ నాలుగు సినిమాల్లో ఏదో కాస్త పర్వాలేదనిపించినా ఆ నిర్మాతలు ఒడ్డెక్కేస్తారు. కానీ తేడా వచ్చిందా రోడ్డున పడడం ఖాయం. ఇక ఈసినిమాల టాక్ బాగోపోతే.. గత వారం వచ్చిన RX మరింత దండుకునే అవకాశం ఉంది

Similar News