రాహుల్ పరిస్థితియేమిటో?

చి.ల.సౌ అనే ప్రేమ కథ చిత్రంతో డీసెంట్ గా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమాని అక్కినేని హీరో సుశాంత్ తో తీసాడు. ఇక [more]

Update: 2019-08-15 08:57 GMT

చి.ల.సౌ అనే ప్రేమ కథ చిత్రంతో డీసెంట్ గా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమాని అక్కినేని హీరో సుశాంత్ తో తీసాడు. ఇక ఆ సినిమా హిట్ అనగానే నాగార్జున కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రాహుల్ ని పిలిచి ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్ గా మన్మధుడు 2 ని తియ్యమని అడగటంతో.. ఎగిరి గంతేసి రాహుల్ మన్మధుడు 2 ని పెద్ద హీరో నాగార్జున తో మొదలెట్టాడు. సినిమా మీద మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. నాగార్జున కూడా కథ మీద నమ్మకంతో తానే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. అయితే మంచి అంచనాల మధ్యన విడుదలైన మన్మధుడు 2 తుస్ మంది. గత శుక్రవారం విడుదలైన మన్మధుడు 2కి యావరేజ్ టాక్ రాగా.. కలెక్షన్స్ మాత్రం ఉసూరుమనిపించాయి.

ఇక మన్మధుడు 2 యావరేజ్ టాక్ తో అయినా ..నాగ్ క్రేజ్ కారణం గా మంచి కలెక్షస్ వస్తాయనుకుంటే… కలెక్షన్స్ మరీ చీప్ గా ఉండేసరికి సక్సెస్ టూర్ ని కూడా నాగ్ క్యాన్సిల్ చేసాడు. అయితే సినిమా మరీ బోల్డ్ గా ఉండడం, కథలో బలం లేకపోవడమే కాదు… దర్శకత్వంలోని బలహీనతల వలన మన్మధుడు కి యావరేజ్ టాక్ పడింది. రాహుల్ మేకింగ్ స్టయిల్ ఏమాత్రం ఇంప్రెస్స్ చేసేదిలా లేదు. మరి మన్మధుడు 2 విడుదలకు ముందు హిట్ అవుతుందననుకున్నారు. అందుకే రాహుల్ తో సినిమాలు చేసేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు మొగ్గు చూపాయి కూడా. కానీ సినిమా విడులయ్యాక రాహుల్ నెక్స్ట్ సినిమా విషయంపై సందిగ్దత నెలకొంది. మన్మధుడు 2 తర్వాత నాగార్జున మరో సినిమా చెయ్యడానికి పెద్దగా టైం పట్టదు… కానీ రాహుల్ కి మరో హీరో దొరకాలంటే కష్టమే. మన్మధుడు 2 తో ద్వితీయ విజ్ఞాన్ని దాటలేకపోయిన రాహుల్ ఇప్పుడు మూడో సినిమా ఏ హీరోతో ఎప్పుడు సినిమా మొదలు పెడతాడో.. అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.

Tags:    

Similar News