వైవిధ్యమైన సినిమా తీస్తున్న రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెరీర్ ను ఓ వైవిధ్యమైన సినిమాతో ముగించాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా అందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో ముగ్గురు [more]

Update: 2019-05-30 08:43 GMT

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెరీర్ ను ఓ వైవిధ్యమైన సినిమాతో ముగించాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా అందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు డైరక్టర్లు, ఓ హీరో అంటూ ప్రచారం చేసారు. అయితే రాఘవేంద్రరావుకి ఒక హీరోతో ముగ్గురు హీరోయిన్లతో మూవీ తీయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి ఒకే సినిమాకి ముగ్గురు డైరక్టర్లు పని చేయనుండటం విశేషం. ఈ ముగ్గురునీ రాఘవేంద్రరావు దర్శకత్వ పరివేక్షణ చేయనున్నారు.

ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు

ఈ ప్రాజెక్ట్ ని బాహుబలి నిర్మాతలు నిర్మించనున్నారు. అసలు ఇంతకీ ఈ మూవీలో హీరో ఎవరు? ఆ ముగ్గురు డైరెక్టర్స్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్న. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్. మూడు కథలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తారు. అయితే మూడింటికీ నాగ శౌర్యనే హీరో కావడం విశేషం. ఇలా రాఘవేంద్రరావు తన చివరి చిత్రం వైవిధ్యంగా చేస్తున్నారు. కానీ ఆయన డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్లు డైరెక్ట్ చేస్తే తన సినిమా ఎలా అయివుతుంది.? ఏమో చూద్దాం సినిమా రిలీజ్ అయ్యేవరకు.

Tags:    

Similar News