నేను అలగలేదు.. తెలుసుకుని రాయండి..!

Update: 2018-12-07 10:52 GMT

ఇవాళ రోజు తెలంగాణ అంతా ఎన్నికల హడవిడి కనిపిస్తోంది. సెలెబ్రిటీస్ అంత పోలింగ్ బూత్ లలో నిలబడి మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ.. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాని ఫ్రీగా ప్రచారం చేస్తూ ఓటర్లని చైతన్యవంతులను చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరూ సతీసమేతంగా వచ్చి తమ పోలింగ్ కేంద్రాల వద్ద లైన్ లో నిలబడి మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక అల్లు అర్జున్, జగపతి బాబు, రానా, లక్ష్మి మంచు, కీరవాణి ఫ్యామిలీ, నితిన్, రామ్, రాజమౌళి ఫ్యామిలీ ఇలా అందరూ ఓటు వేశారు. అయితే ఈ రోజు ఉదయం ఓటు వెయ్యడానికి వచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావు.. క్యూ లైన్ పాటించకుండా ఓటు వెయ్యడానికి వెళుతుంటే క్యూ లో ఉన్న ఓటర్లు అడ్డుకున్నారని... దానికి రాఘవేంద్ర రావు అవమానంగా భావించి ఓటు వెయ్యకుండానే అలిగి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున ఛానల్స్ లో, సోషల్, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. విజయ నిర్మల, కృష్ణ వంటి పెద్ద వయసున్న వారే క్యూ లైన్ లో నిలబడి ఓటు వేస్తే రాఘవేంద్ర రావు మాత్రం లైన్ పాటించకుండా అలిగారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

నేను ఓటేశాను...

అయితే తనపై ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని... క్యూలైన్ లో నిలబడకుండా నేను అలిగి వెళ్లిపోయానని పలు ఛానల్స్ లో వచ్చింది. అది నిజం కాదు. నేను ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. ఆ లైన్ పూర్తయ్యే సరికి చాలా టైం పడుతుంది. అయితే నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో అక్కడి నుండి వెళ్లిపోయాను. క్యూ లైన్లో ఉన్న ఓటర్లు ఎవరూ నన్ను అభ్యంతర పెట్టలేదు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కరం కలిగిన వ్యక్తిని కాను. ఇదిగోండి నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను.. మీరే చూడండి. ఛానల్స్ వార్త వేసే ముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయండి.. అంటూ అసహనం వ్యక్తం చేశారు దర్శకేంద్రుడు.

Similar News