లారెన్స్ కు అంత క్రేజ్ ఉందా..?

తెలుగులో కొరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టైల్, రెబల్ వంటి చిత్రాలకు డైరెక్షన్ చేసి సత్తా చాటిన లారెన్స్.. ఆ సినిమాల కన్నా ముని [more]

Update: 2019-04-19 06:17 GMT

తెలుగులో కొరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టైల్, రెబల్ వంటి చిత్రాలకు డైరెక్షన్ చేసి సత్తా చాటిన లారెన్స్.. ఆ సినిమాల కన్నా ముని సీక్వెల్ తో దర్శకుడిగా బాగా పాపులర్ అయ్యాడు. ముని, కాంచన, గంగ అంటూ హార‌ర్ ఫిలిమ్స్ తో భయపెట్టిన లారెన్స్.. ఇప్పుడు కాంచన 3తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకువ‌చ్చాడు. తమిళంలో తెరకెక్కిన కాంచన 3 ఈ రోజు తెలుగు, తమిళంలో విడుదలవుతుంది. తాను నటించిన సినిమాల‌ను తెలుగులో కూడా విడుదల చేసి క్యాష్ చేసుకునే రాఘవ కాంచన 3ని కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చెయ్యడమే కాదు.. కాంచన 3 రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. లారెన్స్ కి తెలుగులో ఎంత క్రేజుందో అర్ధమవుతుంది.

ఏరియా బిజినెస్

నైజాం 4.00
సీడెడ్ 3.60
అర్బన్ ఏరియాస్ 2.00
ఈస్ట్ గోదావరి 1.40
కృష్ణ 1.20
గుంటూరు 1.80
వెస్ట్ గోదావరి 1.20
నెల్లూరు 0.80
ఏపీ, టీఎస్ షేర్స్ 16 కోట్లు

Tags:    

Similar News