లారెన్స్ అందుకే తప్పుకున్నాడు..!

లారెన్స్ మంచి డాన్సరే కాదు మంచి డైరెక్టర్ కూడా. అతను తీసినా సినిమాలు రీమేక్ కూడా అవుతున్నాయి అంటే అతని సినిమాలు ఎంతలా ఆడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. [more]

Update: 2019-05-22 07:31 GMT

లారెన్స్ మంచి డాన్సరే కాదు మంచి డైరెక్టర్ కూడా. అతను తీసినా సినిమాలు రీమేక్ కూడా అవుతున్నాయి అంటే అతని సినిమాలు ఎంతలా ఆడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు, తమిళంలో ఇతని డైరెక్షన్ లో వచ్చిన ‘కాంచన’ భారీ విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో సాగే ఈ కథకు మన ప్రేక్షకులంతా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ మూవీని అక్షయ్ కుమార్ కథానాయకుడిగా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగిపోయాయి. ఈ రీమేక్ కి కూడా లారెన్స్ నే దర్శకుడిగా తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని తుషార్ కపూర్, షాబినా ఖాన్ నిర్మిస్తున్నారు.

అందుకే తప్పుకున్నా

అయితే రీసెంట్ గా లారెన్స్ కు తెలియకుండా ఈ మూవీ నుండి అక్షయ్ కుమార్ గెటప్ కి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. దీంతో వెంటనే లారెన్స్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. “నాకు తెలియకుండా .. నాతో ఒక మాటైనా చెప్పకుండా ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్ లుక్ ను రిలీజ్ చేశారు. దర్శకుడికి తెలియకుండా నిర్మాతలు ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు అందుకే తప్పుకున్నాను” అని ప్రకటించాడు. తనకు అక్షయ్ కుమార్ తో ఎలాంటి సమస్యా లేదని, ఆయనంటే గౌరవం ఉందన్నారు. అందుకే స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేసా అని అన్నారు. మరి దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News