102 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన 'రాజి'!

Update: 2018-05-29 04:55 GMT

ఒకప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే దర్శక నిర్మాతల్లో కొంచం భయం ఉండేది ఎందుకంటే ఆ సినిమాను ఎలా ప్రెజంట్ చేసిన జనాలకు అంత నచ్చేవి కాదు. కానీ ఈ మధ్య కాలం పరిస్థితి ఆలా లేదు. తెలుగులో అనుష్క..తమిళ్ లో నయనతార..హిందీలో కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఈ ఆలోచనను మార్చారు.

సరిగా తీస్తే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని రుజువు చేసారు. లేటెస్ట్ ఈ కోవలోనే మరో సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి పాఠాలు నేర్పింది. అదే ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'రాజి'. ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్నందుకుంది.

ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.102 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.120 కోట్ల మార్కును అందుకోగలదని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. గత చిత్రాల్లో ‘2 స్టేట్స్’.. ‘బద్రీనాథ్ కి దుల్హానియా’ కూడా వంద కోట్ల క్లబ్బులోకి చేరాయి. ‘2 స్టేట్స్’ 116 కోట్లతో ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత లిస్ట్ లో 'రాజి' చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Similar News