పుష్ప విలన్ దొరికేసాడు!!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ రంపచోడవరం అడవుల్లో మొదలైన విషయం తెలిసిందే. షూటింగ్ మొదలైనా పుష్ప సినిమాకి ఇంకా సుకుమార్ [more]

Update: 2020-11-25 13:13 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ రంపచోడవరం అడవుల్లో మొదలైన విషయం తెలిసిందే. షూటింగ్ మొదలైనా పుష్ప సినిమాకి ఇంకా సుకుమార్ విలన్ ని ఫైనల్ చెయ్యలేదు. అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ ఓ హీరో అయ్యుండాలి.. ఆ నటుడికి పాన్ ఇండియాలో క్రేజ్ రావాలనే యోచనలో సుకుమార్ ఇంతవరకు పుష్ప విలన్ వేటలోనే ఉండిపోయాడు. విజయ్ సేతుపతి అయితే పాన్ ఇండియాకి సరిపోయే విలన్ పాత్ర పడుతుంది అనుకుంటే.. విజయ్ సేతుపతి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దానితో సుకుమార్ కి పుష్ప విలన్ కష్టాలు ఎక్కువయ్యాయి.

అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ విషయంలో అనేక పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పుష్ప విలన్ గా మాధవన్, ఆర్య పేర్లు వినిపించినా.. తాజాగా పుష్ప రాజ్ కి తగ్గ మొగుడు దొరికాడనే టాక్ వినబడుతుంది. అంటే అల్లు అర్జున్ కి సరిపోయే విలన్ దొరికేసాడట. అది తమిళనాట టాప్ హీరోగా కొనసాగి.. కొంతకాలంగా ప్లాప్ సినిమాలు చేస్తున్న ప్రయోగాల హీరో విక్రమ్.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ అంటూ ప్రచారం మొదలయ్యింది. సుక్కు అండ్ అల్లు అర్జున్ లు విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. అయితే పుష్ప విలన్ పాత్ర నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో విక్రమ్ కూడా సుక్కు ఆఫర్ ని కాదనలేకపోయాయాడని సోషల్ మీడియా టాక్.

Tags:    

Similar News