పుష్ప లో బన్నీ అలా కనిపిస్తాడా?

సుకుమార్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గెటప్ లో కనిపించబోతున్నాడనేది పుష్ప పాన్ ఇండియా లుక్ లోనే రివీల్ [more]

Update: 2020-08-16 06:14 GMT

సుకుమార్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గెటప్ లో కనిపించబోతున్నాడనేది పుష్ప పాన్ ఇండియా లుక్ లోనే రివీల్ అయ్యింది. అందుకే బన్నీ లాంగ్ హెయిర్, గెడ్డం పెంచాడు. లాక్ డౌన్ లోను అల్లు అర్జున్ పుష్ప లుక్ నే మైంటైన్ చేస్తున్నాడు. అయితే బన్నీ అందరిలా ఇంట్లోనే ఉండి సీక్రెట్ గా లుక్ మైంటైన్ చెయ్యకుండా.. వాకింగ్, జాగింగ్ అంటూ బయటికి వస్తున్నాడు. పుష్ప లుక్ లోనే బన్నీ కంటిన్యూ అవుతున్నాడు అని మరోసారి రివీల్ అయ్యింది. మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ పుష్ప లుక్ లోనే కనిపించడం కాదు… మాంచి ఫిట్నెస్ తో కనిపించాడు.

అయితే సుకుమార్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని సిక్స్ ప్యాక్ లుక్ లో చూపించబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ చేత సుకుమార్ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేయించాడు. కానీ మహేష్ లుక్ లో ఉన్న ఇబ్బందుల వలన మహేష్ సిక్స్ ప్యాక్ బాడీని సినిమాలో చూపించలేదు. కానీ పుష్ప లో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లుక్ లో కండలు తిరిగిన యంగ్ లారీ డ్రైవర్ గా అదరగొట్టబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మరి అల్లు అర్జున్ వాకింగ్, జాగింగ్ లో నార్మల్ గా కనబడుతున్నప్పటికీ.. జిమ్ లో సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేస్తున్నాడని.. దాని కోసం జిమ్ ట్రైనర్ ని కూడా పెట్టుకున్నాడని టాక్. అందుకే పుష్పలో నిజంగానే బన్నీ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడేమో అని అంటున్నారు.

Tags:    

Similar News