పుష్ప కి ముందు అనుకున్న ప్లానే వర్కౌట్ అయ్యేలా అది!!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప పాన్ ఇండియా మూవీ కరోనా కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యిది కానీ.. లేదంటే అప్పుడే ఐదు [more]

Update: 2020-10-14 08:12 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప పాన్ ఇండియా మూవీ కరోనా కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యిది కానీ.. లేదంటే అప్పుడే ఐదు నెలల షూటింగ్ తో పుష్ప టీం అదరగొట్టేసేదే. అయితే కరోనా కారణంగా ఆగిన పుష్ప షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. నవంబర్ నుండి పుష్ప టీం షూటింగ్ స్పాట్ లో ఉంటారనే టాక్ ఎప్పటినుండో వినిపిస్తూనే ఉంది. అయితే గతంలో అంటే కరోనా విజృభించిన టైం లో పుష్ప షూటింగ్ మొదలు పెడితే.. ఓ రిసార్ట్ బుక్ చెయ్యడమో.. లేదంటే అడవుల్లోని టెంట్స్ వేసుకుని మూవీ టీం మొత్తం అక్కడికి షిఫ్ట్ అయ్యి.. కరోనా టెస్ట్ చేయించుకున్నాక అందరూ ఒక చోటే అంటే ఫుడ్ బెడ్ అన్ని ఒకే చోట పెట్టుకుని.. బయటి వాళ్ళని లోపలికి, లోపల వాళ్ళని బయటికి పంపకుండా స్ట్రిట్ గా షూటింగ్ ప్లాన్ చేద్దామనుకున్నారు.

కానీ అది అప్పుడు జరగలేదు. అయితే తాజాగా పుష్ప టీం ముందు అనుకున్న ప్లాన్ నే వర్కౌట్ చెయ్యాలని అనుకుంటున్నారట. అంటే ఓ ఫెమస్ రిసార్ట్ ని అద్దెకి తీసుకుని మూవీ టీం దగ్గరనుండి మూవీ ఎక్విప్ మెంట్ వరకు అక్కడ రిసార్ట్ కి షిఫ్ట్ అయ్యి.. షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మరి కేరళ అడవులా, నల్లమల ఫారెస్టా , లేదంటే రంప చోడవరం అడవులా అనేది ఇంకా తెగలేదు కానీ.. సుకుమార్ మాత్రం ఈ రిసార్ట్ ఐడియా ని వర్కౌట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడట. మరి రిసార్ట్ నుండి పురుగు బయటికి వెళ్లకుండా…. బయట నుండి ఎవరూ లోనికి రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే పుష్ప టీం రిసార్ట్ కి షిఫ్ట్ అవుతుంది అనే టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

Tags:    

Similar News