పుష్ప పై ఈ వార్తలు నిజమా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా మొదలు కాబోతున్న పుష్ప సినిమా చిత్రీకరణ నవంబర్ నుండి మొదలు కాబోతుంది. కేరళ అడవుల్లో, వాటర్ [more]

Update: 2020-09-28 16:16 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా మొదలు కాబోతున్న పుష్ప సినిమా చిత్రీకరణ నవంబర్ నుండి మొదలు కాబోతుంది. కేరళ అడవుల్లో, వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రంలో సగభాగం చిత్రీకరణ జరగనుంది. అందుకే కేరళ అడవులకి అనువుగా ఉండడానికి వీలుగా సుకుమార్ అండ్ టీం ఏర్పాట్లు చేస్తుందట. ఇప్పటికే హీరోయిన్ రష్మిక లుక్ టెస్ట్ జరుగుతుందని… అల్లు అర్జున్ లుక్ ఫైనల్ అయ్యింది గనక టీం ఇప్పుడు మిగతా విషయాల్లో బిజీగా ఉందట. ఇకపోతే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ ని దిశా పటాని ని ఫైనల్ చేస్తున్నారని, బన్నీ దిశా కావాలని పట్టుబడుతున్నాడనే టాక్ నడిచింది.

కానీ తాజాగా పుష్ప ఐటెం కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లని దింపబోతున్నారట. ఆ విషయాన్నీ ఊర్వశి నే రివీల్ చేసింది. ఓ డాన్స్ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పుష్ప సినిమాలో నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు చూపించబోతున్నాను అని చెప్పడంతో ఊర్వశి నే పుష్ప ఐటెం గర్ల్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక పుష్ప సినిమా కోసం తమిళ హీరో మాధవన్ ని విలన్ రోల్ కి మాధవన్ ని సుకుమార్ ఎంపిక చేసాడనే న్యూస్ మొదలయ్యింది. ఓ కీలక పాత్రకి విజయ్ సేతుపతి తీసుకోగా…. డేట్స్ ప్రోబ్లెంస్ తో విజయ్ సేతుపతి పుష్ప నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ కి సుకుమర్ మాధవన్ ని ఎంపిక చేసాడనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News