బన్నీ పప్పులుడకట్లేదా?

బన్నీ అలా వైకుంఠపురములో సినిమా విషయంలో ఆయన ఏం చెబితే అదే నడిచింది. అలా సాంగ్స్ ఒక్కొక్కటిగా  విడుదల చేస్తే మ్యూజిక్ పరంగా సినిమాకి క్రేజ్ వస్తుంది [more]

Update: 2020-09-03 09:34 GMT

బన్నీ అలా వైకుంఠపురములో సినిమా విషయంలో ఆయన ఏం చెబితే అదే నడిచింది. అలా సాంగ్స్ ఒక్కొక్కటిగా  విడుదల చేస్తే మ్యూజిక్ పరంగా సినిమాకి క్రేజ్ వస్తుంది అని చెప్పి మరీ అలా ఆల్బమ్ ని మార్కెట్ లోకి వదిలి సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల విషయంలో బన్నీ పప్పులు ఉడకటంలేదంటున్నారు. కారణం దర్శకుల మాటే చెల్లుబాటు అవుతుందట. పుష్ప సినిమాకి ఆలా వైకుంఠపురములో మ్యూజిక్ హిట్ ఇచ్చిన థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెడదామనుకుంటే.. కాదు దేవినే బెస్ట్ అంటూ సుకుమార్ దేవీశ్రీని లైన్ లోకి తెచ్చాడు. రంగస్థలానికి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వలేదా? నాకు దేవి మీద నమ్మకముంది అంటూ బన్నీని కన్విన్స్ చేసాడు.

తాజాగా కొరటాల – బన్నీ సినిమాకి  కూడా దేవి శ్రీ నే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కొరటాల శివ చిరు ఆచార్య కోసం దేవిని పక్కనేబెట్టారు. అది చిరు సూచనలతో. కానీ కొరటాల ఆస్థాన విద్వంసకుడు కూడా దేవినే. అయితే ఇప్పుడు బన్నీ సినిమాకి కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ అని కొరటాల ఫిక్స్ అవడమే కాదు.. బన్నీని ఒప్పించాడనే టాక్ మొదలయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ పుష్పాకి బెస్ట్ ఆల్బమ్ ఇస్తే ఖచ్చితంగా కొరటాల – బన్నీ మూవీకి దేవి నే మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఫిక్స్ అని కొరటాల డిసైడ్ అయ్యాడట. మరి అలా వైకుంఠపురములో అప్పుడు బన్నీ మాటే నడిచిన తదుపరి ప్రోజెక్టుల విషయంలో బన్నీ మాట చెల్లడం లేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Tags:    

Similar News