పుష్ప పట్టాలెక్కలేదు.. అప్పుడే కాపీ రగడ!!

భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కాపీ కంటెంట్ అంటూ ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాము. మా కథను వాళ్ళు కాపీ చేసి సినిమా తీసారంటూ ఎవరో [more]

Update: 2020-08-27 08:12 GMT

భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కాపీ కంటెంట్ అంటూ ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాము. మా కథను వాళ్ళు కాపీ చేసి సినిమా తీసారంటూ ఎవరో ఒక రచయిత కంప్లైంట్ చెయ్యడం.. తర్వాత సినిమా విడుదల సమయంలోను ఇలాంటి కాపీ విషయాల్లో రచ్చ చెయ్యడం చూస్తూనే ఉంటాము. అజ్ఞాతవాసి టైం లో త్రివిక్రమ్ కూడా ఇలాంటి కాపీ కథ విషయంలో ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు ఇంకా సెట్స్ మీదకే వేళ్ళని ఓ సినిమా విషయంలో ఈ కాపీ కంటెంట్ విషయం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ పుష్ప ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు. కేవలం ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా విషయం వెలుగులోకి వచ్చింది.

కాకపోతే ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది అనే ప్రచారం ఉంది. అయితే పుష్ప సినిమా కథ నాదే అంటూ ఇప్పుడు ఓ రచయిత బయలు దేరాడు. వేంప‌ల్లి గంగాధర్ అనే రచయిత 2008లో తాను రాసిన త‌మిళ కూలీ క‌థ‌నే సుకుమార్ పుష్ష‌ గా సినిమా తీస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తమిళ కూలి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్, అడవులకి సంబందించిన సినిమానే. ఈ కథనే అటు ఇటు మర్చి పుష్ప గా సుకుమర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడని వెల్లంపల్లి ఆరోపణ. మరి సుకుమర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి. వేంప‌ల్లి మాత్రం పుష్ప కథ తనదే అంటూ పోరాటానికి సిద్దమవుతున్నాడు.


Tags:    

Similar News