పుష్ప లో బాగా ఇన్వాల్వ్ అవుతున్న బన్నీ!

సుకుమార్ ఎప్పుడెప్పుడు పుష్ప తో సెట్స్ మీదకెళదామా అని చూస్తున్నాడు. రంగస్థలం వచ్చి రెండున్నరేళ్లయినా. నెక్స్ట్ మూవీ విషయంలో సుకుమర్ పడుతున్న టెంక్షన్ అంతా ఇంతా కాదు. [more]

Update: 2020-06-28 02:43 GMT

సుకుమార్ ఎప్పుడెప్పుడు పుష్ప తో సెట్స్ మీదకెళదామా అని చూస్తున్నాడు. రంగస్థలం వచ్చి రెండున్నరేళ్లయినా. నెక్స్ట్ మూవీ విషయంలో సుకుమర్ పడుతున్న టెంక్షన్ అంతా ఇంతా కాదు. ఎలాగో బన్నీ తో పుష్ప ని పాన్ ఇండియా మూవీ గా మార్చిన సుకుమర్ కి ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ఆడుగడుగునా అడ్డంకులే. కరోనా తగ్గాలి.. సినిమా సెట్స్ మీదకెళ్ళాయి. అయితే పుష్ప కి కరోనా ముందు భారీ బడ్జెట్ పెట్టి.. పాన్ ఇండియా క్రేజ్ తేవాలని మూవీ టీం నిర్మాతలు భావించారు. అయితే కరోనా వలన బడ్జెట్ లో మార్పులు అంటూ ఇప్పటికే చాలా సినిమాల బడ్జెట్ లలో కోతలు మొదలయ్యాయి.

తాజాగా పుష్ప లెక్కలు కూడా మారుతున్నాయని.. అందుకోసం అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగాడని అంటున్నారు. అయితే బన్నీ పుష్ప లెక్కల్లో వేళ్ళు పెట్టడానికి కారణం.. బన్నీ బంధువొకరు పుష్ప సినిమా నిర్మాతలలో ఒకడిగా ఉన్నాడు. అందుకే బన్నీ కూడా పుష్ప బడ్జెట్ లెక్కల్లో కలగజేసుకుంటున్నాడట. అల వైకుంఠపురములో హిట్ తో పుష్ప కి భారీగా బడ్జెట్ పెట్టాలని… అందులోనూ పాన్ ఇండియా మూవీ కాబట్టి.. ఓ రేంజ్ బడ్జెట్ ఉండాలనే ప్లాన్ లో మూవీ టీం ఉండగా.. ఇప్పుడు కరోనా తో పరిస్థితులు మారిపోబట్టి… పుష్ప కి మరో బడ్జెట్ వేస్తున్నారట. అందులో బన్ని కూడా వుండి.. ఎక్కెడెక్కడ బడ్జెట్ తగ్గించొచ్చో చెబుతున్నాడట. ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాకపోవడం.. రిచ్ లొకేషన్స్ బదులు చిన్న చిన్న సెట్స్ తో అయినా.. లేదంటే లొకేషన్స్ మార్చెయ్యడానికి వీలవుతుంది అని.. అదే గనక షూటింగ్ సగం అయ్యాక లొకేషన్స్ మార్చడం కానీ.. బడ్జెట్ తగ్గించడం కానీ జరిగేది కాదని.. ఇపుడు పుష్ప కి షూటింగ్ మొదలు కాకపోవడమే ప్లస్ అంటున్నారు.

Tags:    

Similar News