వావ్ వాటే కాంబో.. సెట్ అయితేనా?

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిలే వేరు. యంగ్ హీరోలు చాలామంది పూరి తో పనిచేసేందుకు పడి చచ్చేవారే. కానీ కొన్నాళ్లుగా పూరి తన ఫామ్ [more]

Update: 2020-10-14 08:59 GMT

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిలే వేరు. యంగ్ హీరోలు చాలామంది పూరి తో పనిచేసేందుకు పడి చచ్చేవారే. కానీ కొన్నాళ్లుగా పూరి తన ఫామ్ కోల్పోయినా.. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో మూవీ మొదలెట్టేసాడు. ఆ సినిమా తర్వాత పూరి సినిమా కన్ఫర్మ్ అవలేదు కానీ.. కొత్త కథతో ఓ స్టార్ హీరోని పట్టే పనిలో ఉన్నాడు. కన్నడలో కెజిఎఫ్ తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన యాష్ తో పూరి జగన్నాధ్ తదుపరి మూవీ ఉండొచ్చనే ఊహాగానాల మధ్యన యశ్ – పూరి కలిస్తే కేకే అంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత యాష్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చెయ్యడానికి మొగ్గు చూపుతున్నాడనే టాక్ ఉంది.

అది కూడా టాలీవుడ్ తో దర్శకుడితో యాశ్ మూవీ చెయ్యొచ్చని అంటున్నారు. కెజిఎఫ్ తో మాస్ హీరోగా అదరగొట్టిన యాశ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో భీబత్సమైఅన్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో కెజిఎఫ్ 2 తర్వాత యాష్ పాన్ ఇండియా లేవల్లోనే తెలుగు దర్శకుడితో సినిమా అనగానే అందరూ పూరి పేరు తెర మీదకి తెచ్చారు. పూరి జగన్నాధ్ కూడా ఎప్పటినుండో పాన్ ఇండియా మూవీని ఓ స్టార్ హీరోతో చేద్దామంటే… తెలుగు హీరోలెవరు సందు ఇవ్వడం లేదు. కాబట్టే పూరికి యశ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి మాస్ దర్శకుడు పూరి – మాస్ హీరో యాష్ కలిస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే.

Tags:    

Similar News