పూరి నెక్స్ట్ బాలయ్య తోనేనా?

చాలా ఏళ్ళ తరువాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈసినిమా మంచి వసూళ్ల తో దూసుకుపోతుంది. [more]

Update: 2019-07-20 07:58 GMT

చాలా ఏళ్ళ తరువాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈసినిమా మంచి వసూళ్ల తో దూసుకుపోతుంది. పూరి కి హిట్ లేని టైములో బాలయ్య పూరిని పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడు. పూరి కూడా బాలయ్యను ఎవరు చూపించని విధంగా చాలా కొత్తగా అండ్ సైటీలిష్ గా ప్రెజెంట్ చేయడంలో పూరీ సక్సెస్ అయ్యాడు. కానీ ‘పైసా వసూల్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా బాలయ్య పూరి తో మరో సినిమా చేద్దాం అని మాట ఇచ్చాడట. అది కూడా ఇస్మార్ట్ శంకర్ తరువాతే అని కండిషన్ పెట్టాడట.

మరి పూరి నెక్స్ట్ బాలయ్య తో చేస్తాడా? లేదా ఎవరన్నా యంగ్ హీరోస్ తో చేస్తాడా? అనేది తెలియాల్సిఉంది. ఇప్పటికే మహేష్ తో పూరి ఓ సినిమా చేయాల్సివుంది కానీ అది మహేషే ఆపుతున్నాడు.తనకు హిట్ వస్తేనే చేస్తా అంటున్న మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ అంటేనే నాకు ఇష్టం అంటున్నాడు పూరి. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ హిట్ తరువాత మహేష్ మీతో సినిమా చేస్తాను అని అంటే నాకు క్యారెక్టర్ ఉండాలి కదా అన్నారు పూరి. సో ఇప్పుడిదంతా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. అలానే చిరు రీఎంట్రీ ఫిలిం పూరి తో చేయాలి కానీ ఆయన చేయలేదు. ప్రస్తుతం పూరి కి హిట్ వచ్చింది కాబట్టి స్టార్ హీరోస్ ఎవరన్నా లైన్ కడతారా? లేదా బాలయ్యతో నెక్స్ట్ సినిమా చేస్తాడా అనేది తెలియాలి. పూరి తో సినిమాలు చేయడానికి చాలామంది యంగ్ హీరోస్ నుండి స్టార్ట్ హీరోస్ వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Tags:    

Similar News