పూరి – విజయ్ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

క్రేజీ కాంబినేషన్ అయినా విజయ్ దేవరకొండ – పూరి ల సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో [more]

Update: 2019-08-26 08:08 GMT

క్రేజీ కాంబినేషన్ అయినా విజయ్ దేవరకొండ – పూరి ల సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ అయినా వెంటనే పూరి తో సినిమా స్టార్ట్ చేస్తాడు. దీనికి ఆల్రెడీ ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. టైటిల్ తగ్గట్టుగానే ఇందులో విజయ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు.

ఈమూవీలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో ఇప్పటినుండే ఈసినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా పూరి సినిమాల్లో హీరోల లుక్ నుండి ఆటిట్యూడ్ వరకు సరికొత్తగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇందులో విజయ్ ను ఎలా చూపించబోతున్నాడో అని ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు దేవరకొండ ఫ్యాన్స్.

ఇక ఈమూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించనున్నారని తెలుస్తుంది. హీరోయిన్, ఇతర నటీనటులు,మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సిఉంది.

Tags:    

Similar News