పూరి కి నెక్స్ట్ హీరో దొరికాడా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు. ఒకప్పుడు పూరి దర్శకత్వానికి ఉన్న క్రేజ్ ఇప్పుడు అస్సలు లేదు. ఒకప్పుడు హీరోల పాత్రలను పిచ్చెక్కించే రేంజ్ [more]

Update: 2019-07-22 10:09 GMT

దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు. ఒకప్పుడు పూరి దర్శకత్వానికి ఉన్న క్రేజ్ ఇప్పుడు అస్సలు లేదు. ఒకప్పుడు హీరోల పాత్రలను పిచ్చెక్కించే రేంజ్ లో డిజైన్ చేసే పూరి.. కొన్నాళ్లుగా హీరో లకు సరైన పాత్రని ఇవ్వలేకపొతున్నాడు.పూరి లోను దర్శకుడు మెల్లిమెల్లిగా మరుగున పడిపోయాడు. టెంపర్ తర్వాత ఇజం, రోగ్, లోఫర్, మెహబూబా సినిమాలతో డిజాస్టర్స్ తొట్టాడు. ఇక తాజాగా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తో మాత్రం హిట్ కొట్టేసాడు పూరి. అయితే గతంలో కొట్టిన హిట్స్ తో పోలిస్తే ఇస్మార్ట్ శంకర్ అంత హిట్ అనిపించుకోదు. గుడ్డిలో మెల్లగా ఇస్మార్ట్ శంకర్ టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇస్మార్ట్ ప్రమోషన్స్, రామ్ నటనతో సినిమా మీద క్రేజ్ ఏర్పడి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళుతున్నారు కానీ.. పూరి మీద నమ్మకంతో కాదు.మూడు రోజులకు 36 కోట్ల గ్రాస్ తో ఇస్మార్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక పూరి ఇస్మార్ట్ హిట్ తో రెండు నెలలు హాలీడే తీసుకోబోతున్నాడు. ఇప్పటివరకు హాలిడే అన్న పదం దరిచేరనీయని పూరి ఇస్మార్ట్ హిట్ తో హాలిడేకెళుతున్నాడు.

అయితే పూరి నెక్స్ట్ సినిమా మీద అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వినిపించేస్తున్నాయి. ఇస్మార్ట్ హిట్ తో మహేష్ ని కెలికిన పూరి జగన్నాధ్.. తన నెక్స్ట్ హీరో గా బాలయ్యతో చేస్తాడో? లేదంటే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ని పడతాడా అంటూ సోషల్ మీడియాలో కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. బాలయ్య బాబుతో పూరి నెక్స్ట్ సినిమా అంటున్నారు కానీ…. అది వర్కౌట్ అయ్యేలాలేదు. ఇక ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ గతంలో మహేష్ తో చెయ్యాలనుకున్న జనగణమన చేసే అవకాశాలున్నాయంటూ ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది. పూరి చేతిలో విజయ్ దేవరకొండ గనక పడితే.. విజయ్ ని మాస్ మెచ్చేలా పూరి మేకోవర్ చెయ్యడం ఖాయం గనక.. విజయ్, పూరికి ఛాన్స్ ఇస్తే బావుంటుంది అంటూ విజయ్ అభిమానులు హంగామా మొదలెట్టారు. అయినా విజయ్ క్రేజ్ ముందు పూరి నిలవగలడా? డియర్ కామ్రేడ్ గనక హిట్ అయితే విజయ్, పూరికి దొరకడం అసాధ్యం,. డియర్ కామ్రేడ్ గనక అటో ఇటో అయితే విజయ్ దేవరకొండ, పూరి గురించి ఆలోచించే అవకాశాలు ఉంటాయి

Tags:    

Similar News