పూరికి అంత పొగరు దేనికి?

ఎస్..పూరి జగన్నాధ్ మంచి దర్శకుడే. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక హిట్ కోసం ట్రై చేసి తీసిన సినిమాలు గతంలో పోకిరి, బిజినెస్‌మేన్‌, టెంపర్‌. [more]

Update: 2019-07-21 07:49 GMT

ఎస్..పూరి జగన్నాధ్ మంచి దర్శకుడే. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక హిట్ కోసం ట్రై చేసి తీసిన సినిమాలు గతంలో పోకిరి, బిజినెస్‌మేన్‌, టెంపర్‌. ఈమూడు సినిమాలకి ముందు పూరి డౌన్ లోనే ఉన్నాడు అని చెప్పాలి. పోకిరి టైములో పూరి డౌన్ లో ఉంటె మహేష్ ఛాన్స్ ఇచ్చాడు. అలానే బిజినెస్‌మేన్‌ టైములో కూడా. ఇదేవిధంగా ఎన్టీఆర్ కూడా పూరి ని నమ్మి తనకు హిట్స్ లేకపోయినా టెంపర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ ఇచ్చాడు.

గతంలో పూరి తనకి హిట్స్, ప్లాప్స్ ఉన్న ఎప్పుడూ హద్దు మీరి మాట్లాడలేదు. చాలా పొలైట్ గా సమాధానాలు చెప్పేవాడు. ఎక్కడ నోరు పారేసుకోలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో పూరి మహేష్‌ హిట్స్‌ తీసే దర్శకులతోనే సినిమాలు చేస్తాడని, ఈసారి అతను చేస్తానని వచ్చినా కానీ తాను చేయనని, ఎందుకంటే తనకి క్యారెక్టర్‌ వుందని నోరు జారాడు. మరి పోకిరికి, బిజినెస్ మాన్ సినిమాలకి ముందు పూరి పరిస్థితి ఏంటో ఆలోచించుకోలేదేమో. సరే నిజంగా పూరి అంత గొప్పగా ఫామ్‌లోకి వచ్చేసాడా? ఒకవేళ వచ్చాడు అనుకుంటే ఒక స్టార్ ని అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో స్టార్‌ హీరోలు తనకోసం క్యూ కట్టేస్తారనుకోవడం కూడా అవివేకం. ఎందుకంటే ఈమూవీ కమర్షియల్‌ సక్సెస్‌ మినహా దర్శకుడిగా అతని ఖ్యాతిని పెంచేదేమీ కాదనేది సత్యం. చూద్దాం నెక్స్ట్ సినిమాతో పూరి ఏంటో అర్ధం అయిపోతుందిగా..

Tags:    

Similar News