హమ్మయ్య... మహేష్, ప్రభాస్ ఫాన్స్ ఖుషీ అయ్యారు...!

Update: 2018-10-14 04:05 GMT

నిన్నటివరకు ప్లాప్ హీరోయిన్ పూజ హెగ్డే అరవింద సమేత లో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది..ఐరెన్ లెగ్ హీరోయిన్ అమ్మో అని ఎన్టీఆర్ ఫాన్స్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ మొన్న గురువారం విడుదలైన అరవింద సమేత - వీర రాఘవ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ సరసన అరవింద కేరెక్టర్ లో మెరిసిన పూజ హెగ్డే కి అరవింద ముందువరకు హిట్ అయిన సినిమానే లేదు. ఒక లైలా కోసం, ముకుంద, డీజే వంటి సినిమాలు బావున్నాయనిపించినా.. ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో.. పూజ హెగ్డే ని ఐరెన్ లెగ్ అనేసారు. కానీ అరవింద సమేత హిట్ అవడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త కుదురుపడ్డారు.

ఊపిరి పీల్చుకున్న.......

కేవలం ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు.. ఇప్పుడు మహేష్ ఫాన్స్ తో పాటుగా ప్రభాస్ ఫాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పూజ నటించిన అరవింద సమేత హిట్ అవడంతో.... మహేష్ తో మహర్షి సినిమాలో చేస్తున్న పూజ హెగ్డే విషయంలో కాస్త ఊపిరి పీల్చుకున్నారు మహేష్ ఫాన్స్. అరవింద టాక్ కోసం ఎదురు చూసిన మహేష్ ఫాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐరెన్ లెగ్ ముద్ర నుండి బయటికొచ్చిన పూజ హెగ్డే విషయంలో అనుమానాలు పక్కన పడేసారు.

ప్రభాస్ తోకూడా....

అలాగే ప్రభాస్ ఫాన్స్ కూడా అరవింద సమేత హిట్ తో కాస్త జోష్ లోకెళ్లారు. ప్రభాస్ తో పూజ హెగ్డే.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20 లో నటిస్తుంది. ఇక అరవింద సమేత లో అరవింద గా పూజ హెగ్డే గ్లామర్ కి మంచి పేరే వచ్చింది. అయితే పూజ హెగ్డే వాయిస్ మాత్రం అంత సెట్ కాలేదనే విమర్శలొచ్చాయి. మహేష్ పక్కన కూడా పూజ గ్లామర్ తో పడేస్తుందని.. ప్రభాస్ పక్కన కూడా హైట్ తో పూజ అదరగొడుతుందనే ధీమాలో మహేష్ అండ్ ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.

Similar News