మెహ్రీన్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు..!

Update: 2018-12-15 08:35 GMT

2016 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మెహ్రీన్ కౌర్ ఫీర్జాదా చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. పాపం ప్రస్తుతం ఈ పంజాబి ముద్దుగుమ్మకు సినిమాల ఛాన్స్ వస్తున్నా అవి సరిగా ఆడటం లేదు. సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తుంది కానీ ఒక్కటి కూడా హిట్ కావడం లేదు. మరోపక్క ఒప్పుకున్న సినిమాలతో పేచీలు. ఇలా కన్యూకూజన్ లో మెహ్రీన్ లేటెస్ట్ గా సుధీర్ బాబుతో ఒక సినిమా చేయడానికి సైన్ చేసి అడ్వాన్స్ కూడా తీసుకుంది. అనుకోకుండా సుధీర్ బాబు ఆ సినిమా నుండి పక్కకు తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్ వచ్చాడు.

ఫిర్యాదు చేసిన నిర్మాతలు

అయితే ఈ ప్రాజెక్ట్ కి ముందు మెహ్రీనే హీరోయిన్ అనుకుని అడ్వాన్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి కళ్యాణ్ దేవ్ రావడం.. ఈక్వేషన్లు మారడంతో ఆమెకి బదులు వేరే హీరోయిన్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుని మెహ్రీన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని అన్నారట నిర్మాతలు. అందుకు మెహ్రీన్ ససేమిరా అనడంతో, ఇప్పుడు రచ్చంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు చేరింది. నా డేట్స్ మొత్తం వేస్ట్ చేసారు. దీనివల్ల నాకు రెండు పెద్ద సినిమాలు పోయాయి అని గోల చేస్తుందంట. అయితే ఆమెకూ ఆమె స్టయిలిస్టుకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాలంటూ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Similar News