రిలీజ్ కి ముందే ఎఫ్2 కు ఇబ్బందులు..!

ఈ సంక్రాంతి సీజన్ లో పోటీకి నాలుగు పెద్ద సినిమాలు ఉంటే అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘పేట’ రిలీజ్ అయ్యాయి. ‘కథానాయకుడు’ కి మంచి రెస్పాన్స్ రాగా.. [more]

Update: 2019-01-11 08:25 GMT

ఈ సంక్రాంతి సీజన్ లో పోటీకి నాలుగు పెద్ద సినిమాలు ఉంటే అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘పేట’ రిలీజ్ అయ్యాయి. ‘కథానాయకుడు’ కి మంచి రెస్పాన్స్ రాగా.. ‘పేట’ కు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ రోజు విడుదల అయ్యే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ పరిస్థితి మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మూడు చిత్రాలే కాకుండా ఎఫ్ 2… ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో వెంకటేష్ తో వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లాంటి స్టార్స్ ఉన్న ఈ సినిమాకు ఎందుకో క్రేజ్ రావడం లేదు. సాంగ్స్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు.

అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా లేక

ఎఫ్2 కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా ఇంతవరకు ఆశించిన రీతిలో టిక్కెట్లు అమ్ముడవ్వడం లేదు. హైదరాబాద్ లోని మూసాపేట్ ఏరియాలో లక్ష్మీకళ థియేటర్లో బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ కనీసం 20% వరకు కూడా టిక్కెట్లు సేల్ అవలేదు. మరి ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ లేకనా లేదా దీని ముందు రిలీజ్ అయిన పెద్ద సినిమాల ప్రభావమా అనేది తెలియదు. లక్ష్మీకళ ఒక్కటే కాదు ఎఫ్2 థియేటర్స్ అన్ని పరిస్థితి ఇదే. ఇలా అయితే ఓపెనింగ్స్ కూడా కష్టమే.

Tags:    

Similar News