అందులో మోదీ కంటే ప్రియాంకనే గొప్ప

Update: 2018-07-05 11:18 GMT

బాలీవుడ్ నుంచి ఇటీవలే హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. హాలీవుడ్ ప్రవేశంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకున్న ఆమె ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రికార్డు సృష్టించింది. ప్రియాంక చోప్రా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్ మార్క్ కి చేరింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లోనే ఘనంగా ప్రకటించింది. ‘25 మిలియన్ స్ట్రాంగ్...ధన్యవాదాలు...మీరు నన్నెంతగా అభిమానిస్తున్నారో, నేను మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను’ అని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అయితే, హాలీవుడ్ రంగప్రవేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన ప్రియాంక ప్రస్థుతం ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కంటే ముందుంది. ప్రధాని ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 13.5 మిలియన్లు కాగా, అమితాబ్ కు 9.5, షారుక్ ఖాన్ కు 13.3 మిలియన్, సల్మాన్ ఖాన్ కు 17.3 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇక ఈ విషయంలో ప్రియాంక వెనకాలే దీపిక పదుకొనే కూడా ఉంది. ఆమెకు ప్రస్థుతం ఇన్ స్టాగ్రామ్ లో 24.9 మిలియన్ పాలొవర్లు ఉన్నారు.

Similar News