పాపం.. ప్రియాంక అనాల్సిందే..!

Update: 2018-08-09 06:38 GMT

ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్... సారి సారి హాలీవుడ్ ప్రియాంక చోప్రాని చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే బాలీవడ్ ని వదిలేసి హాలీవుడ్ కి చెక్కేసిన ప్రియాంకకి ఇప్పుడు హాలీవుడ్ లో ఊహించని షాక్ తగిలింది. హాలీవుడ్ మీదున్న ఇష్టంతో అక్కడ ఆఫర్ రాగానే ఇక్కడ సల్మాన్ ఖాన్ భరత్ కి హ్యాండ్ ఇచ్చేసి మరీ హాలీవుడ్ కి చెక్కేసింది. హాలీవుడ్ లో కౌబాయ్‌ నింజా వైకింగ్‌ ఆఫర్ రావడంతో.. ప్రియాంక చోప్రా తాను బాలీవుడ్ లో చెయ్యబోయే భరత్ సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకుంది. సల్మాన్ సరసన భారీ పారితోషకానికి ఒప్పుకుని భరత్ సినిమా కోసం ముంబై వచ్చిన ప్రియాంక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉండగానే.. కౌబాయ్‌ నింజా వైకింగ్‌ సినిమా ఆఫర్ రావడంతో... భరత్ టీమ్ కి హ్యాండ్ ఇచ్చేసింది.

షాక్ ఇచ్చిన హాలీవుడ్ దర్శకుడు

ఇక భరత్ నిర్మాత కాస్త తిట్టుకున్నప్పటికీ.. ప్రియాంక ప్లేసులోకి మరో భామ సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ ని తీసుకున్నారు. అయితే హాలీవుడ్ మీద మోజుతో బాలీవుడ్ ఆఫర్ ని కాలదన్నిన ప్రియాంకకి కౌబాయ్‌ నింజా వైకింగ్‌ దర్శకుడు షాకిచ్చాడు. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ప్రియాంక నటించబోయే కౌబాయ్‌ నింజా వైకింగ్‌ హాలీవుడ్ మూవీ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఆ విషయం స్వయానా ఆ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నమాట. తమ సినిమా టెక్నికల్ కారణాల వల్ల షూటింగ్ షెడ్యూలింగ్ లో తలెత్తిన సమస్యల వలన ఇప్పట్లో పట్టాలెక్కేక్కడం లేదని.. సినిమా షూటింగ్ మొదలు కావడానికి టైం పడుతుంది అంటూ తమ సినిమా షూటింగ్ ని నిరవధికంగా వాయిదా వేశారు.

ఇప్పుడేమి చేస్తుందో...

మరి ఆ హాలీవుడ్ సినిమా వాయిదా పడడంతో.. ఇప్పుడు ప్రియాంక పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఎందుకంటే భారీ పారితోషంకం ఇస్తానన్నా భరత్ ని కాదని హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక ప్రస్తుతం మాత్రం.. ఆ సినిమాని వదిలేసి సోనాల్ బోస్ దర్శకత్వం వహిస్తున్న ద స్కై ఈజ్‌ పింక్‌ మీద దృష్టి సారించింది. ఎందుకంటే హాలీవుడ్ మూవీ కౌబాయ్‌ నింజా వైకింగ్‌ కి ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాలేదట. ఇప్పటికీ డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌ లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలోనే ఉన్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ షెడ్యూల్ కూడా ఎప్పుడు సెట్ అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చేలా లేదు. మరి ఇది చూస్తుంటే పాపం ప్రియాంక అనిపించడం లేదూ.

Similar News