ప్రియాంక చోప్రా దొరికిపోయింది

పొగతాగడం చాలా చెడ్డ అలవాటు అని గతంలో ట్వీట్ చేసిన ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా పొగ తాగుతూ ఇలా అడ్డంగా దొరికిపోయి నెటిజనులతో చీవాట్లు తింటోంది. [more]

Update: 2019-07-22 10:15 GMT

పొగతాగడం చాలా చెడ్డ అలవాటు అని గతంలో ట్వీట్ చేసిన ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా పొగ తాగుతూ ఇలా అడ్డంగా దొరికిపోయి నెటిజనులతో చీవాట్లు తింటోంది. అమెరికా లో తన బర్త్డే వేడుకులు సందర్భంగా పార్టీ లో గుప్పు గుప్పు మంటూ పొగ వదలడం, అవి కెమెరాకి చిక్కడం, అవి బయట వైరల్ అవ్వడం, అవి చూసి నెటిజనులు తెగ కామెంట్స్ చేయడం జరుగుతున్నాయి.

మియామీ సముద్రంలో అదో అందమైన విలాసవంతమైన యాచ్ (పడవ) లో తన భర్త నిక్ జోనాస్ తో కూర్చుని తన స్నేహితులు అయినా మధు చోప్రాతో కలిసి సిగిరెట్ తాగుతూ దొరికిపోయింది.గతంలో ఈమె దీపావళికి బాణసంచా కాల్చొద్దని.. వాతావరణ కాలుష్యం అవుతుందని క్లాస్ తీసుకుని నిక్యాంక పెళ్లిలోనూ భారీగా బాణ సంచా కాల్చడంపైనా నెటిజనులు అప్పటిలో ఫైర్ అయ్యారు. నీతులు చెప్పడం కాదు నువ్వు అవ్వి ముందు పాటించు అంటున్నారు.

కొంతమంది అయితే ఆ ఫోటో ని పెట్టుకుని తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి దీని సమాధానం ప్రియాంక ఏం చెబుతుందో చూద్దాం.

Tags:    

Similar News