దర్శకుడు విషెస్ చెబితే.. నిర్మాత ఫైర్ అవుతున్నాడు

Update: 2018-07-29 06:43 GMT

ఇప్పుడు బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఒక వివాదంలో ఇరుక్కుంది. హాలీవుడ్ అంటేనే లైఫ్ అన్నట్టుగా ప్రియాంక బాలీవుడ్ సినిమాలను వదిలేసింది. హాలీవుడ్ లో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా... హాలీవుడ్ హాలీవుడ్ అంటూ బికినీస్ వేసుకుని దానినే పట్టుకుని వేలాడుతుంది. ఇప్ప్పుడిక సినిమాలే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ కూడా హాలీవుడ్ సింగర్. ఇక ప్రస్తుతం తనకన్నా వయసులో చిన్న వాడైనా నిక్ జోనస్ తో డీప్ లవ్ లో ఉండడమే కాదు చెట్టాపట్టాలేసుకుని ఈ జంట ముంబై టు అమెరికా అంటూ తిరుగుతున్నారు.

అయితే రాకరాక బాలీవుడ్ లో ప్రియాంక చోప్రాకి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే సినిమాలో హీరోయిన్ ఆఫర్ రావడం... భారీ పారితోషికానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇక ప్రియాంక ఓకె చెప్పాక దర్శక నిర్మతలు ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేసారు. మరికొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్ మీదకెళుతుందన్న టైం లో ప్రియాంక చోప్రా భరత్ టీం కి హ్యాండ్ ఇచ్చింది. భరత్ సినిమాలో నటించడం లేదని దర్శక నిర్మాతలకు చెప్పేసింది. అయితే దర్శకుడు మాత్రం ప్రియాంక కి ట్విట్టర్ లో ఆల్ ద బెస్ట్ చెప్పడం చూస్తుంటే ఏ హాలీవుడ్ ఆఫరొ.. లేదంటే సింగర్ నిక్ జొనాస్‌తో పెళ్లి కోసమో ప్రియాంక భరత్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ప్రచారం జరిగింది.

అయితే దర్శకుడైతే ఆల్ ద బెస్ట్ చెప్పాడు కానీ.. భరత్ నిర్మాత నిఖిల్ నమిత్ మాత్రం ప్రియాంక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు చెప్పగానే ఒకింత షాకయ్యడట. దెబ్బకి చిర్రెత్తిన నిర్మాత నిఖిల్ నమిత్ ప్రియాంక చోప్రా పై ఫైర్ అవుతున్నాడు. ప్రియాంక చోప్రాకి వృత్తి పట్ల నిబద్ధతలేదని... రెండురోజుల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిందని అందువల్ల తమ సినిమాకి ఎంతో లాస్ అంటున్నాడు ఆయన. ఇక తాజాగా ప్రియాంక ప్లేస్ ని సల్మాన్ ఖాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ కానీ... సల్మాన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన జాక్వెలిన్ కానీ నటించే ఛాన్సెస్ ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల భోగట్టా..!

Similar News