ప్రియమణి ఆ పాత్రలోనా?

హీరోయిన్ గా ఫెడవుట్ అయిన ప్రియమణి.. రియాలిటీ షోస్ కి జేడ్జ్ గాను, వెబ్ సీరీస్ లలోను నటిస్తోంది . అయితే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ [more]

Update: 2020-04-25 09:25 GMT

హీరోయిన్ గా ఫెడవుట్ అయిన ప్రియమణి.. రియాలిటీ షోస్ కి జేడ్జ్ గాను, వెబ్ సీరీస్ లలోను నటిస్తోంది . అయితే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి… తాజాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమాలో నటిస్తోంది . వెంకటేష్ నారప్ప లో హీరోయిన్ గా డీ గ్లామర్ పాత్రలోనూ నటిస్తోంది . విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గాను, రానా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎప్పుడూ డిఫ్రెంట్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే సాయి పల్లవి ఈ సినిమాలో నక్సలైట్ గా కనబడనుందనేది సమాచారం.

అయితే ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుంది అంటున్నారు కానీ.. అది ఏ రోల్ అనేది స్పష్టత లేదు. కానీ తాజాగా ప్రియమణి కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సాయి పల్లవి పక్కన వెన్నంటి ఉండే పాత్రలోనూ, సాయి పల్లవిని ఇన్స్పైర్ చేసే పాత్రలోనూ ప్రియమణి కనిపిస్తుంది అని.. ఈ రోల్ తో ప్రియమణికి మంచి అవకాశాలు రావడం పక్కా అంటున్నారు. ఇక విరాట పర్వం ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ విరాటపర్వం సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 

Tags:    

Similar News