అనుష్క సమంతల పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో కలిసి నటించిన క్రేజ్ తెచ్చుకోలేక… తొందరగా ఫెడవుడ్ అయిన హాట్ హీరోయిన్ ప్రియమణి.. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ డాన్స్ షోలకు [more]

Update: 2019-10-13 06:50 GMT

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో కలిసి నటించిన క్రేజ్ తెచ్చుకోలేక… తొందరగా ఫెడవుడ్ అయిన హాట్ హీరోయిన్ ప్రియమణి.. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ డాన్స్ షోలకు జెడ్జి గా వ్యవహరించడమే కాదు… బాలీవుడ్ తో పాటుగా అనేక భాషల్లో డబ్ అయిన ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో కీ రోల్ లో నటించింది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సూపర్ హిట్. ఇక సీజన్ 2 కూడా త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో చాలామంది హీరోయిన్స్ తమకు తగిన పారితోషకం రానందుకు అసంతృప్తిగా ఉన్నారనే ప్రశ్నకు… అదిరిపోయే సంధానం చెప్పింది.

బాలీవుడ్ హీరోయిన్స్ విషయమొదిలేస్తే… సౌత్ లో మాత్రం నయనతార, సమంత, అనుష్కలకు మాత్రమే డిమాండ్ చేసి మరీ పారితోషకం తీసుకోగల సత్తా ఉందని.. తమ క్రేజ్ ని బట్టే వారు తమ పారితోషకాన్ని నిర్మాతలనుండి వసూలు చేస్తున్నారని… మిగతా హీరోయిన్స్ కి అంత సీన్ లేదని తేల్చేసింది…. ఈ మాజీ హీరోయిన్ ప్రియమణి.

Tags:    

Similar News