ఎంత మోసం… ఎంత మోసం..!

కేవలం కన్నుగీటే దృశ్యంతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఓరు అదార్ లవ్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ [more]

Update: 2019-02-15 08:28 GMT

కేవలం కన్నుగీటే దృశ్యంతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఓరు అదార్ లవ్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రియాకి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంది టీం. ఆమె కోసం మళ్లీ రీషూట్ చేసారు. అదనంగా ఆమె సీన్స్ కొన్ని యాడ్ చేసారు. అందుకే సినిమా రిలీజ్ లేట్ అయ్యింది. ఇక నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా చాలా భాషల్లో అనువాదం అయ్యి రిలీజ్ అయింది. తెలుగులో లవర్స్ డే అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా చూసి బయటకి వచ్చిన వాళ్లు హాహాకారాలు చేస్తున్నారు.

అసలు ఆమె హీరోయిన్ కాదు…

సౌత్ లోనే ఇదొక డిజాస్టర్ చిత్రమని… ఏదో ఊహించుకుని వెళ్తే సినిమాలో ఇంకేదో ఉందని అంటున్నారు. అసలు ప్రియాది చిత్రంలో లీడ్ రోల్ కాదని… సైడ్ క్యారెక్టర్లా ఉన్న అమ్మాయిని ప్రధాన కథానాయికను చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కన్నుగీటే దృశ్యాలు ఆల్రెడీ చూశాం. అంతకుమించి సినిమాలో ఏమీ లేదు అంటున్నారు. నిర్మాతలు ఆమె ముఖం పెట్టుకుని బిజినెస్ చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Tags:    

Similar News