ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ కోసం కర్చీఫులు..!

‘ఆ’ మూవీతో తొలి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజ‌శేఖ‌ర్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ [more]

Update: 2019-05-17 08:24 GMT

‘ఆ’ మూవీతో తొలి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజ‌శేఖ‌ర్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో 'క‌ల్కి' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ కూడా చాలా బాగుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చాలా కొత్తగా స్టైలిష్ గా ఉండడంతో అందరికీ నచ్చింది. అందుకే ఈ సినిమాను భారీ రేట్స్ కి అమ్ముదాం అని ట్రై చేస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కి ముందే కొంతమంది యంగ్ హీరోస్ మనోడితో వర్క్ చేయాలని ముందుగానే క‌ర్చీఫులు రెడీ చేసుకుంటున్నారు.

ఆసక్తి చూపిస్తున్న యువ హీరోలు

వారిలో ఒక్కరు ‘ఆ’ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు నాని. ప్రస్తుతం నాని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ నానికి ఓ క‌థ వినిపించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అలా నానితో ఓ సినిమా ముందే ఫిక్స‌య్యాడు. అదే విధంగా నాగ చైతన్య , శ‌ర్వానంద్ లాంటి యువ హీరోలు కూడా ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ట‌చ్‌లోకి వెళ్తున్నార‌ట‌. ఏమన్నా మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దాం అని చెబుతున్నారు అంట. మరి అనుకున్నట్టే కల్కి హిట్ అయితే మనోడి జాతకమే మారిపోతుంది.

Tags:    

Similar News