పూజ హెగ్డే ని పొగిడిన హీరోయిన్?

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజ హెగ్డే కి అందం ఉన్న అభినయం లేదనేది జగమెరిగిన సత్యం. కేవలం గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రల్తోనే స్టార్ [more]

Update: 2020-09-02 04:40 GMT

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజ హెగ్డే కి అందం ఉన్న అభినయం లేదనేది జగమెరిగిన సత్యం. కేవలం గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రల్తోనే స్టార్ హీరోల చాయిస్ గా మారిన పూజ హెగ్డే నటనకి మైనస్ మార్కులు పడుతుంటాయి. ఇప్పటివరకు తనని తాను నిరూపించుకునే పాత్ర రాలేదనే చెప్పాలి. అయినా పూజ హెగ్డే సుడి ఎలా ఉంది అంటే స్టార్ హీరోస్ మెయిన్ చాయిస్ ఎవరయ్యా అంటే ఇక పూజ హెగ్డే తప్ప మరో హీరోయిన్ కనిపించడం లేదు. అయితే తాజాగా లాక్ డౌన్ నుండి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న హీరోయిన్స్ కన్నా ముందు పూజ హెగ్డే నే షూటింగ్ కి బయలుదేరుతుంది. షూటింగ్స్ పెట్టండి నేను రెడీ అంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ తనని తన నటనని ఆయా భాషల్లో చాలామంది పొగుడుతుంటారని… ఆ ప్రశంశలన్నిటిలో తనని ఓ హీరోయిన్ పొగడడం మాత్రం ఎప్పటికి మరిచిపోలేనని చెబుతుంది పూజ.

తాను గతంలో తన పాత్రలకి డబ్బింగ్ చెప్పుకునేదాన్ని కాదని.. కానీ అరవింద సమేత సినిమా అప్పుడు అరవింద పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా అని.. అయితే ఆ డబ్బింగ్ చెప్పింది నేను అని తెలియక ఓ టాప్ హీరోయిన్ అరవింద సమేతలో నీ పాత్రకి ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ.. నా తర్వాత సినిమాలో ఆమెతోనే నేను డబ్బింగ్ చెప్పించుకుంటానని అడగడం నా గొంతుని, నా డబ్బింగ్ ని పొగడడం మాత్రం ఎప్పటికి మరిచిపోలేనని అంటుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది పేరు చెప్పనని చెబుతుంది పూజ హెగ్డే. కానీ ఆమె పొగుడుతుంటే చాలా సంతోషంగా నిపించింది అని చెబుతుంది. ఇక పూజ ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీలోనూ, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లోను నటిస్తుంది.

Tags:    

Similar News