ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేస్తున్నారే.!

తమన్నా – ప్రభుదేవా కాంబినేషన్ లో అభినేత్రి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. [more]

Update: 2019-05-21 08:39 GMT

తమన్నా – ప్రభుదేవా కాంబినేషన్ లో అభినేత్రి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పైగా ఒకేరోజు రిలీజ్ కావడం విశేషం. ఒకే హీరో, ఒకే హీరోయిన్ కలిసి నటించినా సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. విషయంలోకి వెళ్తే తమిళంలో తమన్నా – ప్రభుదేవా కలిసి ఆల్రెడీ అభినేత్రి వచ్చింది. ఇప్పుడు అభినేత్రి 2 రాబోతుంది.

బాలీవుడ్ లోనూ హారర్ సినిమాతో

ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. అలానే వీరిద్దరూ కలిసి బాలీవుడ్ లో ‘ఖామోషి’ అనే హారర్ చిత్రంలో నటించారు. దీనికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఇది కూడా ఈ నెల 31వ తేదీనే విడుదల కానుండటం విశేషం. ఇలా తమన్నా – ప్రభుదేవా కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు ఒకే రోజున విడుదల కావడం నిజంగా అరుదుగానే చెప్పుకోవాలి.

Tags:    

Similar News