ప్రభాస్ పుట్టిన రోజుకి అది కూడా కన్ఫర్మ్ అవుతుందా?

ప్రభాస్ పుట్టిన రోజు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రభాస్ ఫాన్స్ లో ఉత్సుకత పెరిగిపోతుంది. ఏ పుట్టిన రోజుకి ఫాన్స్ ఇంతగా ఎగ్జైట్ అవలేది. కారణం ఎప్పుడు ఒకే [more]

Update: 2020-10-09 05:48 GMT

ప్రభాస్ పుట్టిన రోజు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రభాస్ ఫాన్స్ లో ఉత్సుకత పెరిగిపోతుంది. ఏ పుట్టిన రోజుకి ఫాన్స్ ఇంతగా ఎగ్జైట్ అవలేది. కారణం ఎప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఉండే ప్రభాస్ ఈసారి ఏకంగా మూడు సినిమాలను ఒప్పుకున్నాడు. రాధేశ్యాం అప్ డేట్ లో ప్రభాస్ కి విషెస్ చెబుతూ జస్ట్ పోస్టర్ వదిలినా.. నాగ్ అశ్విన్ – వైజయంతి మూవీస్ వారు ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాకి సంబందించిన కిల్లర్ అప్ డేట్ ని ఓ రోజు ముందుగానే ప్లాన్ చేసింది. ఇక ప్రభాస్ మూడో స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ కి సంబందించిన హీరోయిన్ అప్ డేట్ ఉంటుంది అనే టాక్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో నడుస్తుంది. ఇక మూడు అప్ డేట్స్ తో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ గా పండగ చేసుకోబోతున్నారు.

కానీ వాళ్ళకి ప్రభాస్ మరో అప్ డేట్ తో సర్ప్రైజ్ కూడా ఇచ్చెయ్యబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. అది ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి టచ్ లో ఉండడమే కాదు… ఇప్పటికే వారి మధ్య కథా చర్చలు మొదలయ్యాయని.. ఇక కథ ఫైనల్ అయినా అవ్వకపోయినా.. ప్రభాస్ తన పుట్టిన రోజునాడు యూవీ క్రియేషన్స్ లో ప్రశాంత్ నీల్ తో సినిమాని ఎనౌన్స్ చేయబోతున్నాడని సోషల్ మీడియా టాక్. నాగ్ అశ్విన్ సినిమాని అశ్విని దత్ నిర్మాణంలో, ఆదిపురుష్ ని టి సీరీస్ నిర్మాణంలో చెయ్యబోతున్న ప్రభాస్ మళ్ళి ప్రశాంత్ నీల్ సినిమా కోసం యూవీ వారితోనే జట్టు కట్టబోతున్నాడని.. యూవీ వారు ప్రశాంత్ నీల్ ని బయటికి పోకుండా కట్టిపడేస్తున్నారనే టాక్ వినిపిస్తుంటే.. మరోపక్క ఎన్టీఆర్ ఫాన్స్ ప్రశాంత్ నీల్ తో మా హీరో సినిమా ఏం చేస్తావయ్యా అంటూ నిలదీస్తున్నారు. ఇక ప్రభాస్ ఫాన్స్ మాత్రం ప్రభాస్ ఇస్తున్న అప్ డేట్స్ కి మైమరచిపోతున్నారంటే నమ్మాలి.

Tags:    

Similar News