మరోసారి యుద్ధ కళలు నేర్చుకోబోతున్నాడా?

ప్రభాస్ బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. గుర్రం స్వారీ చెయ్యడం దగ్గరనుండి విలు విద్య నేర్చుకుని బాణం వెయ్యడం వరకు, అలాగే యుద్ధం లో శత్రువుల [more]

Update: 2020-08-23 07:00 GMT

ప్రభాస్ బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. గుర్రం స్వారీ చెయ్యడం దగ్గరనుండి విలు విద్య నేర్చుకుని బాణం వెయ్యడం వరకు, అలాగే యుద్ధం లో శత్రువుల కోసం కత్తిని తిప్పడం దగ్గరనుండి శత్రువులను మట్టుబెట్టే విద్యలను చాలానే నేర్చుకున్నాడు. ఏనుగు సవారి చెయ్యడం అబ్బో బాహుబలి కోసం ఐదేళ్లు కష్ట పడ్డాడు. కాబట్టే ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత సాహో అనే యాక్షన్ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యాం అంటూ ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్ తో మరో సోసియో ఫాంటసీ మూవీకి రెడీ అవుతున్నాడు.

ఇక బాలీవుడ్ క్రేజీ దర్శకుడు ఓం రనౌత్ తో ప్రభాస్ ఆదిపురుష్ అంటూ ఓ విజువల్ వండర్ గా ఉండబోయే సినిమా ప్రకటించాడు. బాహుబలిగా అదరగొట్టిన ప్రభాస్ ఏ కేరెక్టర్ లో అయినా ఇట్టే ఇమడగలడని.. రోల్ ఎలాంటిది అయినా సరే ప్రభాస్ కటౌట్ అలా సరిపోతుంది. అందుకే ప్రభాస్ ను తప్ప రామునిగా మరొకరి విజువల్ నాకు కనపడలేదని దర్శకుడు రనౌత్ అంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ మరోమారు కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలు విద్య నేర్చుకోడానికి తనని తాను ట్రాన్సఫర్మెట్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. అలాగే మంచి బాడీ ఫిట్నెస్ కోసం అప్పుడే ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట. ఇక ఎలాంటి గ్యాప్ రానివ్వకుండా ప్రభాస్ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ ఫాన్స్ ని ఖుష్ చేస్తున్నాడు.

Tags:    

Similar News